Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

గ్రామంలో పొంగి పొరలుతున్న భక్తిభావం

ప్రారంభానికి ముస్తాబవుతున్న ఆలయం

మాలలతో స్వాముల సందడి

పెన్ పహాడ్ ప్రతినిధి/ నిజం న్యూస్

మండలంలోని దుపహడ్ గ్రామంలో కోటి రూపాయల దాతల సహకారంతో సర్పంచ్ బిట్టు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్మించి తుది మెరుగులు దిద్దుకుంటున్న శ్రీశ్రీశ్రీ సీతారామ, దుర్గా, మహేశ్వర ఆలయం ప్రారంభించేందుకు, విగ్రహ ప్రతిష్ఠ మరియు ధ్వజస్తంభ ప్రతిష్టకు ముస్తాబవుతుంది.

Also read: రూ. 200 పెరిగిన బంగారం

కాగా ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠకు మే 30, 31వ తేదీలను అర్చకులు, వేద పండితులు ఖరారు చేయగా అందుకొరకు నియమ నిష్ఠలతో గడిపేందుకు గ్రామంలోని 21 మంది పురుషులు మాలలు ధరించి సందడి చేస్తున్నారు.

దాంతో గ్రామంలో భక్తిభావం పొంగి పొరలుతుంది. అయితే మరికొంత మంది భక్తులు రానున్న రోజుల్లో 21 రోజుల మాల ధరిస్తారని నాగేశ్వరరావు తెలిపారు.

అయితే ఆలయంలో ప్రతిష్ట చేయబోయే విగ్రహాలు మహాబలిపురం నుండి ధ్వజస్తంభం ములుగు నుండి తీసుకొచ్చినట్లు ఆయన తెలిపారు.

మాలలు ధరించిన వారిలో మల్లెపల్లి రామయ్య, చెరుకుపల్లి శ్రీనివాస్, గుండు బ్రహ్మం, పిన్నమనేని ప్రవీణ్, సైదులు, సందీప్, పరమేష్, బిట్టు భాస్కరరావు, భరత్, అభినవ్, చిన్న జగన్నాథం, లోకేష్, గోపగాని సాయిలు, పబ్బతి కోటేశ్వరరావు, మసనం నిఖిల్, నరేష్, గోపాచారి, మణి వర్మ, రుషిత్, ఫణి వర్మ అన్నారు.