అక్రమ మద్యం స్వాధీనం…ఎక్కడంటే…

 వెబ్ డెస్క్:
పశ్చిమగోదావరి జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. జిల్లాలోని జీలుగుమిల్లి అంతరాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టు వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో తెలంగాణ నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన మద్యం విలువ సుమారు 35వేలు ఉంటుందని పోలీసులు తెలిపారు. మద్యం బాటిల్స్, బైక్, తోపాటు వ్యాన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు.