తుపాకులతో బెదిరించి.. నగల షాప్ లో దోపిడీ

వెబ్ డెస్క్:
గోల్డ్ షాప్ సిబ్బందిని తుపాకులతో బెదిరించి ముగ్గరు యువకులు నగల దోపిడీ చేశారు. ఈ ఘటన యూపీలోని అలీగఢ్ లో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం…మాస్క్ ధరించిన ముగ్గురు యువకులు బైక్ పై వచ్చారు. జ్యుయలరీ షాపులోకి ప్రవేశించారు. ఆ తర్వాత సిబ్బందిని తుపాకులతో బెదిరించారు. షాపులోని బంగారాన్ని బ్యాగ్ ల్లో వేసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. కాగా దుండగుల దగ్గర తుపాకులు ఉండటంతో వారిని ఎవరూ అడ్డుకోలేకపోయారు. దీనిపై పోలీసులకు షాపు యాజమాని ఫిర్యాదు చేశారు. కాగా సీసీ టీవీ పుటేజ్ ల ఆధారంగా నిందితులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.