Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఉచిత పాలిటెక్నిక్ కోచింగ్

 

*సంపర* *విద్యార్థులకు* *ఆసరాగా* *నిలుస్తున్న* *టీంసీ* ..

కాకినాడ జిల్లా ..ఏప్రిల్ 20

నిజం న్యూస్…

అనపర్తి నియోజకవర్గ పరిధిలో సంపర గ్రామానికి చెందిన సంపర ఎంప్లాయిస్ అసోసియేషన్ (సీ),గ్రామానికి చెందిన విద్యార్థుల భవిష్యత్ కు భరోసాగా నిలుస్తూ, విద్యార్థులకు అనేక ప్రోత్సాహకాలు ఇస్తుంది.

ఈ నేపథ్యంలో గ్రామంలో ప్రభుత్వ జిల్లా పరిషత్ హైస్కూల్ లో ఇటీవల 10 వతరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరైన విద్యార్థులు పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష కోచింగ్ నిమిత్తం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రముఖ విద్యా సంస్థ మోడరన్ కాలేజి యాజమాన్యం సౌజన్యంతో సంపర గ్రామం నుండి మోడరన్ కాలేజీకి ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసి విద్యార్థులకు ఆసరాగా నిలుస్తుంది,

Also read: ప్రతి దశాబ్దానికి వచ్చే అరుదైన సూర్యగ్రహణం ఇది

ఈ సందర్బంగా వడ్డి వెంకటేశ్వర్లు

టీమ్ సీ ప్రతిపాదనలు వివరిస్తూ విద్యార్థులలో ఆరోగ్యకరమైన వాతావరణంలో పోటీ పరీక్షల నేపథ్యాన్ని పరిచయం చేసే ప్రయత్నంలో భాగంగా పొలి సెట్ నందు 100 లోపు స్టేట్ ర్యాంక్ సాధించిన విద్యార్థికి 25000 రూపాయల నగదు పురస్కారం ప్రకటించడం జరిగిందని పేర్కొంటూ,అలాగే విద్యార్థులకు ఉచితంగా మోడరన్ విద్యా సంస్థల ద్వారా ప్రణాళికబద్దమైన కోచింగ్ ను అందజేయటానికి ముందుకు రావడమే గాక కాలేజీ బస్సు కూడా ఏర్పాటు చేసిన మోడరన్ అధినేత లయన్

జి.వి.రావుకు ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్బంగా మోడరన్ అధినేత లయన్

జి.వి.రావు మాట్లాడుతూ సంపర గ్రామం ఉద్యోగస్తులు(సీ ) అందరూ సంఘటితంగా ఈ విధంగా విద్యార్థుల భవిష్యత్ కు కృషి చేయడం గొప్ప స్ఫూర్తి దాయకం అని టీం సీ కృషిని అభినందించారు.

ఈ విషయం లో టీం సీ కి,మోడరన్ విద్యాసంస్థలకు అనుసంధానంగా నిలిచిన మోడరన్ ఇంటర్ కాలేజీ ప్రిన్సిపాల్ సి హెచ్ రాజేష్, అకడమిక్ అడ్వైజర్,ఆంగ్ల అధ్యాపకులు అయిన చల్లా శ్రీనివాస్ కృషిని జివి రావు అభినందించారు.ఈ కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు త్రిమూర్తులు,టీం సీ సభ్యులు ఎం.నారాయణ మూర్తి, శ్రీరాములు,మిగతా సభ్యులు మోడరన్ కాలేజీ సివిక్స్ అధ్యాపకులు ఎన్ ఎస్ ప్రభాకర్ పాల్గొన్నారు..