Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

కానిస్టేబుల్ మోసం… మహిళ ఆత్మహత్య

వెబ్‌డెస్క్: చిత్తూరు జిల్లాలో దారణ ఘటన చోటుచేసుకుంది. విధి నిర్వాహణలో భాగంగా అమ్మాయిలను మోసం చేసిన వారి తాట తీయాల్సిన పోలీసే దారుణానికి పాల్పడ్డారు. పెళ్లైన మహిళతో సహజీవనం చేసి, మళ్లీ పెళ్లి చేసుకుంటానని ఓ కానిస్టేబుల్ నమ్మబలికాడు. వివరాళ్లోకి వెళితే… జిల్లాలోని మదనపల్లెకి చెందిన సుగుణ(34)కి ములకలచెరువు మండలం పెద్దయ్యగారిపల్లెకి చెందిన రమణారెడ్డితో వివాహమైంది. పెళ్లైన కొన్నేళ్లకే భర్త వదిలేయడంతో ఆమె మదనపల్లెలోని గౌతమీనగర్‌లో బ్యూటీపార్లర్ నడుపుకుంటూ తన ఇద్దరు పిల్లలను చదివించుకుంటోంది.

ఈ క్రమంలో జైళ్ల శాఖలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న కర్నూలు జిల్లాకు చెందిన చంద్రకాంత్ బదిలీపై మదనపల్లె వచ్చాడు. అతనితో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. దీంతో ఆ కానిస్టేబుల్ ఆమెను మళ్లీ పెళ్లి చేసుకుంటానని నమ్మించి, సహజీవనం చేస్తున్నాడు. రోజులు గడచిపోతున్నా పెళ్లి ఊసెత్తకపోవడంతో సుగుణ ప్రియుడు చంద్రకాంత్‌ని నిలదీసింది. ఈ క్రమంలోనే మరో అమ్మాయితో చంద్రకాంత్‌కి పరిచయం ఉన్నట్టు సుగుణకి తెలిసింది. నంద్యాలకి చెందిన యువతితో ఫోన్‌లో మాట్లాడుతున్నట్టు తెలిసి నిలదీసింది. అనంతరం తీవ్ర మనస్థాపానికి గురైన సుగుణ ఇంట్లోనే చీరతో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. కానిస్టేబుల్ చంద్రకాంత్ మోసం చేయడం వల్లే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న విచారణ చేపట్టారు.