సస్పెన్స్ థ్రిల్లర్‌గా అఖిల్ ఏజెంట్
స్పై థ్రిల్లర్ జోనర్ వచ్చే కథలు ఎప్పుడు ఒకే తీరుగా ఉంటాయి. వాటిలో చాలా వరకు సక్సెస్ అవుతూ ఉంటాయి. దానికి కారణం హైవోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ స్పీడ్ గా సాగే స్క్రీన్ ప్లే అంతకు మించి విలన్ హీరో ఎత్తులు పై ఎత్తులతో సాగిపోయే ఆసక్తికరమైన కథాంశం ఉండటమే.
క్యారెక్టర్స్ మారొచ్చు కాని మెయిన్ స్లాట్ మాత్రం మారదు. టాలీవుడ్ నుంచి అఖిల్ అక్కినేని హీరోగా ఏజెంట్ మూవీ ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. స్పై థ్రిల్లర్ గానే ఈ సినిమాని హైవోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ ని దర్శకుడు సురేందర్ రెడ్డి ఆవిష్కరించారు.
ALSO READ: వైజాగ్ లో ఆస్కార్ అవార్డు ఫిల్మ్ ఫెస్టివల్
ఈ మూవీ ట్రైలర్ తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. మాఫియా ఆటకట్టించే రా ఏజెంట్ గా అఖిల్ ఈ మూవీలో నటిస్తున్నాడు. ఇక సినిమాలో అఖిల్ క్యారెక్టరైజేషన్ కాస్తా కొత్తగా ఉంది. వక్కంతం వంశీ ఈ మూవీకి కథ అందించారు. సురేందర్ రెడ్డి వక్కంతం వంశీ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు కమర్షియల్ గా ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యాయి.
ఈ నేపధ్యంలో ఏజెంట్ మూవీ నచ్చుతుందని భావిస్తున్నారు. అలాగే పఠాన్ తో పోలిక పెట్టి చూడటం వలన సినిమా కచ్చితంగా మంచి ఓపెనింగ్స్ మూవీకి వస్తాయి.
తరువాత కంటెంట్ తో సురేందర్ రెడ్డి ఎంత వరకు ప్రేక్షకులని ఎంగేజ్ చేసాడు అనే దాని విూద లాంగ్ రన్ సక్సెస్ ఆధారపడి ఉంటుంది. టాలీవుడ్ లో స్పై థ్రిల్లర్ కాన్సెప్ట్ లతో సినిమాలు వచ్చిన ఈ రేంజ్ లో అయితే ఇప్పటి వరకు రాలేదని చెప్పాలి. మరి ఆడియన్స్ ని ఏజెంట్ ఏ మేరకు ఆకట్టుకుంటుంది అనేది చూడాలి.