నల్గొండ సభకు వెళ్లను.. ఉత్తమ్
నల్లగొండ సభపై సమాచారం లేదు
సూర్యాపేట,ఏప్రిల్19 నల్లగొండ జిల్లా కేంద్రంలో ఈ నెల 21న టీపీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న నిరుద్యోగ నిరసన దీక్ష నిర్వహణపై తనకు సమాచారం లేదని, తాను వెళ్లనని నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.
టీపీసీసీ ఆధ్వర్యంలో ఈ నెల 21న నల్లగొండలో నిరుద్యోగ నిరసన దీక్ష కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు విూడియాలో వార్తలు చూసిన అనంతరం తనకు తెలిసిందన్నారు.
ALSO READ: కాంగ్రెస్‌ది రాజకీయ నిరుద్యోగ మార్చ్
హైదరాబాద్‌లో ప్రియాంకగాంధీ సభ ఎప్పుడు ఉన్నా నల్లగొండ నుంచి భారీగా కార్యకర్తలను తరలించడానికి తనవంతుగా ప్రయత్నిస్తానని అన్నారు. నిరసన దీక్షకు వెళుతున్నారా అని విలేకరులు ప్రశ్నించగా, దీక్షపై తనకు ఇప్పటివరకు ఎలాంటి సమాచారం రాలేదని, తాను వెళ్లడం లేదని స్పష్టంచేశారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి వివాదం తనకు తెలియదన్నారు. నిరుద్యోగుల సమస్య విూద కాంగ్రెస్ పోరాటం చేస్తుందని పేర్కొన్నారు.