ఏదీ నిజం.. శ్రావణి కేసులో ఊహించని ట్విస్టులు..

వెబ్‌డెస్క్: సీరియల్ యాక్టర్ శ్రావణి ఆత్మహత్య కేసులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఆమె మరణం తర్వాత, కొన్ని ఆడియా, సీసీ టీవీ ఫుటేజి దృశ్యాల ఆధారంగా పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఇప్పటికే శ్రావణి కేసులో దేవరాజును రెండ్రోజుల పోలీసులు విచారించగా.. నేడు సాయికృష్ణ, నిర్మాత అశోక్ రెడ్డి విచారణకు హాజరుకానున్నట్లు సమాచారం.

అయితే, ఆత్మహత్య చేసుకోవడానికి ముందు శ్రావణిపై సాయి దాడిచేసినట్లు వెల్లడైంది. దాని సంబంధించిన వీడియోలు, ఆడియోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సాయికృష్ణ వేధింపుల వల్లే శ్రావణి ఆత్మహత్య చేసుకున్నదని ఆమె తల్లి ఆరోపిస్తోంది.

ఇదిలాఉండగా, శ్రావణి ఆత్మహత్యకు ముందు జరిగిన పరిణామాలను ఆమె తమ్ముడు శివ మీడియాకు వెల్లడించాడు. హైదరాబాద్‌కు వచ్చిన కొత్తలో సాయికృష్ణ వారి కుటుంబ బాగోగులు చూసేవాడని వివరించాడు. ఆ తర్వాత దేవరాజుతో పరిచయం ఏర్పడిందని చెప్పాడు. అతను కొన్నిరోజులు తమ ఇంట్లో ఉన్నాడని.. ఆ తర్వాత ఇంటికి రావొద్దని అక్క చెప్పడంతో రాలేదన్నాడు. దేవరాజ్ వేరే అమ్మాయితో తిరుగుతున్నాడని శ్రావణి చెప్పిందని.. అతని దగ్గర వారిద్దరూ కలిసి దిగిన ఫొటోలు, వీడియోలు ఉన్నాయని భయపడిందని శివ వెల్లడించాడు. అయితే, అక్క డిప్రెషన్‌లో ఉన్నప్పుడు నిర్మాత్ అశోక్ రెడ్డి తమ కుటుంబానికి ధైర్యం చెప్పాడని.. దేవరాజ్ బ్లాక్ మెయిల్ చేయడం వల్లే శ్రావణి ఆత్మహత్య చేసుకున్నదని ఆమె తమ్ముడు స్పష్టంచేశాడు.