142.86 కోట్ల జనాభాతో అగ్రభాగంలో భారత్
ప్రపంచంలో అత్యధిక జనాభాగల దేశంగా భారత్
చైనాను మించి ముందు వరసలో నిలిచాం
ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక వెల్లడి
న్యూఢల్లీి,ఏప్రిల్19: ప్రపంచంలో అత్యధిక జనాభాగల దేశంగా భారత దేశం రికార్డు సృష్టించింది. జనాభా విషయంలో చైనాను వెనుకకు నెట్టింది. చైనా జనాభా 142.57 కోట్లు కాగా, భారత దేశ జనాభా 142.86 కోట్లు. ఐక్యరాజ్య సమితి బుధవారం విడుదల చేసిన నివేదిక ఈ వివరాలను వెల్లడిరచింది.
వివిధ దేశాల జనాభా సమాచారాన్ని ఐక్యరాజ్యసమితి 1950 నుంచి సేకరిస్తోంది. అత్యధిక జనాభాగల దేశాల జాబితాలో ప్రథమ స్థానంలో భారత దేశం నిలవడం ఇదే మొదటిసారి. చైనా జనాభా 1960 తర్వాత మొదటిసారి గత ఏడాది తగ్గింది. 1960లో అప్పటి మావో జెడాంగ్ ప్రభుత్వ వ్యవసాయ విధానాల వల్ల విపత్తు సంభవించింది. ఫలితంగా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. భవిష్యత్తులో కూడా చైనా జనాభా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి.
జననాల రేటు తగ్గడం, ప్రస్తుత ఉద్యోగ, కార్మిక వర్గంలో అధిక వయసుగలవారు ఉండటం వంటి కారణాల వల్ల జనాభా తగ్గవచ్చు. జననాల రేటును పెంచేందుకు చైనాలోని వివిధ రాష్టాల్రు ప్రణాళికలను ప్రకటిస్తున్నాయి. అయినప్పటికీ సత్ఫలితాలు రావడం లేదు.
ALSO READ: తోడేళ్లంతా ఏకమై చీకటి యుద్ధం చేస్తున్నాయి..
ఇదిలావుండగా, భారత దేశంలో 2011 నుంచి జనాభా లెక్కల సేకరణ జరగలేదు. దేశ జనాభా గురించి అధికారిక లెక్కలు లేవు. దశాబ్దానికి ఒకసారి జనాభా లెక్కలను సేకరించవలసి ఉంది. షెడ్యూలు ప్రకారం 2021లో జనాభా లెక్కల సేకరణ జరగవలసి ఉన్నప్పటికీ, కోవిడ్`19 మహమ్మారి కారణంగా ఆ పక్రియ వాయిదా పడిరది.
ఈ క్రమంలో ఐక్యరాజ్య సమితి స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ 2023 పేరుతో జనాభా లెక్కలను విడుదల చేసింది. అందులో ప్రపంచంలోని అన్ని దేశాలకంటే భారతదేశ జనాభానే ఎక్కువగా ఉన్నట్లు వెల్లడిరచింది. జనాభాలో చైనాను దాటిన భారత్.. అత్యధిక జనాభా కలిగిన దేశంగా అగ్రభాగాన నిల్చింది.
ప్రస్తుతం చైనా జనాభా 142.57 కోట్లు ఉంటే.. భారత్ జనాభా 142.86 కోట్లకు చేరుకుంది. అయితే, భారత్.. చైనా జనాభాను ఎప్పుడు దాటిందో మాత్రం స్పష్టం చేయలేదు. ఐక్యరాజ్య సమితి బుధవారం విడుదల చేసిన లెక్కల్లో.. ఈ ఏడాది మధ్యలోనే 29 లక్షల జనాభాతో భారత్ చైనాను అధిగమించినట్లు తెలిపింది.
అయితే, గతంలో ఎన్నడూ భారత్ చైనా జనాభాను అధిగమించలేదు. జనాభా పరంగా భారత్, చైనా దేశాల తర్వాత 340 మిలియన్ల జనాభాతో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మూడో స్థానంలో నిలిచినట్లు ఐక్యరాజ్య సమితి నివేదికలో వెల్లడిరచింది.