Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

తోడేళ్లంతా ఏకమై చీకటి యుద్ధం చేస్తున్నాయి..

ఇక విశాఖ నుంచే పాలన
సెప్టెంబర్‌ నుంచి కాపురం పెడతా
ఉత్తరాంధ్ర అభివృద్థికి ప్రత్యేక దృష్టి
రూ.4,361 కోట్ల వ్యయంతో మూలపేట గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టు
తోడేళ్లంతా ఒక్కటై చీకటి యుద్దం చేస్తున్నాయి
విూ బిడ్డ ఒక్కడే విూ వైపు  పోరాడుతున్నాడు
శ్రీకాకుళం పర్యటనలో విపక్షాలపై జగన్‌ విసుర్లు
శ్రీకాకుళం,ఏప్రిల్‌19: సెప్టెంబర్‌ నుంచి విశాఖపట్టణం నుంచే పాలన ప్రారంభించనున్నట్టు ఏపీ సీఎం జగన్‌ కీలక ప్రకటన చేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. మూలపేట గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టుకు సీఎం జగన్‌ శంకుస్థాపన చేశారు. రూ.4,361 కోట్ల వ్యయంతో గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టు నిర్మాణం జరగనుంది. అలాగే ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం ఫిషింగ్‌ హార్బర్‌.. హిరమండలం వంశధార లిప్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో జగన్‌ మాట్లాడుతూ.. విశాఖలో సెప్టెంబర్‌ నుంచి కాపురం పెడతామన్నారు. వికేంద్రీకరణలో భాగంగా విశాఖలోనే బస చేస్తామన్నారు. విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటు చేస్తామని జగన్‌ వెల్లడిరచారు. వికేంద్రీకరణలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనేదే తన తపన అని జగన్‌ చెప్పుకొచ్చారు. పెత్తందార్లకు, పేదల పక్షాన ఉన్నవారికి మధ్య యుద్ధం జరుగుతోందన్నారు. ఇంకా జగన్‌ మాట్లాడుతూ.. ‘విూ బిడ్డ ఒక్కడే ఒకవైపు ఉన్నాడు. మిగతా వారందరూ ఏకమవుతున్నారు. అందరూ ఏకమై చీకటి యుద్ధం చేస్తున్నారు. ఒకే అబద్దాన్ని పదేపదే చెబుతూ నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు.

ALSO READ: ఎపి ఖజానా దివాళా….జీతాలు ఇవ్వడానికే నానా కష్టాలు

మూలపేట పోర్టు అభివృద్ధికి మూలస్తంభం. రాబోయే రోజుల్లో శ్రీకాకుళం ముఖచిత్రం మారుతుంది. మూలపేట పోర్టు 100 బిలియన్ల సామర్థ్యానికి చేరుతుంది. మూలపేట పోర్టుతో 35 వేల మందికి ఉపాధి అవకాశం ఉంది. మూలపేట పోర్టుతో మరో 2 ఫిషింగ్‌ హార్బర్లు నిర్మిస్తామన్నారు.

రాష్ట్రంలో అన్ని ప్రాంతాల వారికి ఆమోద్యయోగ్యమైన నగరం విశాఖ అని, అందుకే విశాఖను రాజధానిగా చేశామని ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రంలో పెత్తందారులకు.. పేదల పక్షాన నిలబడ్డ తనకు మధ్య యుద్ధం జరుగుతోందన్నారు.. ప్రజలంతా ఈ యుద్ధంలో తనకు అండగా ఉండాలని కోరారు. విూ బిడ్డ ప్రతి ఇంటికీ లబ్ది చేకూరేలా పని చేస్తున్నాడు… విూకు లబ్ది చేకూరిందని నమ్మితేనే నాకు ఓటేసి ఆశీర్వదించండని అన్నారు.

శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి అభ్యర్థిగా దువ్వాడ శ్రీనివాస్‌ ను సిఎం జగన్‌ ప్రకటించారు. తోడేళ్లంతా ఏకమై చీకటి యుద్ధం చేస్తున్నాయన్నారు జగన్‌. జిల్లా పర్యటనలో నాలుగు కీలక ప్రాజెక్టులకు సీఎం జగన్‌ శ్రీకారం చుట్టారు.

ఈ సందర్బంగా జగన్‌ మాట్లాడుతూ.. 46 నెలల్లో ఉత్తరాంధ్ర అభివృద్ధికి పెద్దపీట వేసినట్లు తెలిపారు. మరో చెన్నై, ముంబైలా మారనున్న శ్రీకాకుళం జిల్లా మారనుందని సీఎం జగన్‌ పేర్కొన్నారు. మే 3న భోగాపురం ఎయిర్‌పోర్టు, అదానీ సెంటర్లకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. టెక్కలిలో దువ్వాడ శ్రీనును ఆశీర్వదించాలన్నారు.

రాష్ట్రంలో అందరికీ ఆమోదయోగ్య నగరం విశాఖ అని పేర్కొన్న జగన్‌.. ఈ సెప్టెంబర్‌ నుంచి విశాఖలోనే ఉంటానంటూ స్పష్టంచేశారు. ప్రాంతాల మధ్య వైషమ్యాలు పోవాలనే.. అన్ని జిల్లాల అభివృద్ధి కొనసాగుతోందని తెలిపారు. ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్నదే తపన అంటూ క్లారిటీ ఇచ్చారు.

ఈ సందర్భంగా ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు గుప్పించారు. విూ బిడ్డ ఒక్కడే ఒకవైపు ఉన్నాడు.. మిగతా వాళ్లంతా ఏకమవుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో పెత్తందార్లు.. పేదల పక్షాన నిలబడిన నాకు మధ్య యుద్ధం జరుగుతోందన్నారు. ఒకే అబద్దాన్ని పదేపదే చెబుతున్నారంటూ సీఎం జగన్‌ మండిపడ్డారు. వాళ్లలా అబద్దాలు చెప్పే అలవాటు తనకు లేదని.. ఈ యుద్ధంలో నా ధైర్యం, నమ్మకం విూరేనంటూ పేర్కొన్నారు.

దేవుని దయ.. విూ చల్లని ఆశీస్సులే కోరుకుంటున్నారు.. తోడేళ్లన్నీ ఏకమైనా.. నాకేవిూ భయం లేదంటూ సీఎం జగన్‌ వ్యాఖ్యానిం చారు. ముందుగా శ్రీకాకుళం చేరుకున్న సీఎం జగన్‌.. గంగమ్మతల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంతబొమ్మాళి మండలంలో రూ.4,362 కోట్లతో మూలపేట పోర్టు పనులకు భూమి పూజ చేశారు.

ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌, రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్‌, జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.