Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఎపి ఖజానా దివాళా….జీతాలు ఇవ్వడానికే నానా కష్టాలు

అభివృద్ధిలో అంతా తడబాటు !
డబ్బుల పందేరం అభివృద్ది ఎలా అవుతుంది
జగన్‌ ప్రభుత్వ తీరుపై విపక్షాల దాడి

అమరావతి,ఏప్రిల్‌19:మూడు రాజధానుల ముచ్చట ఇంకా ముగిసిపోలేదు. విశాఖ ఉక్కుపై కేంద్రాన్ని నిలదీసే ధైర్యం రావడం లేదు. నాగుగేళ్లయినా అమరావతిలో అడుగు పడలేదు. అలాగని మూడు రాజధానులపైనా జగన్‌ సర్కార్‌ ముందడుగు వేయడం లేదు.

అభివృద్ది అంటే డబ్బుల పందేరం అన్న కొత్త నిర్వచనం చెప్పిన సిఎం జగన్‌..కేవలం అధికారం నిలుపుకునే ప్రయత్నంలో మాత్రమే ఉన్నారు. డబ్బులను కాతాల్లో వేస్తూ పోతున్నారు. దీంతో ఎపి ఖజానా దివాళా తీసి జీతాలు ఇవ్వడానికే నానా కష్టాలు పడాల్సి వస్తోంది. ఈ క్రమంలో ఉద్యోగులు కూడా ఆందోళనబాట పట్టారు.

రాష్ట్ర విభజన నాటి నుండి రాజధానిని ఎక్కడ నిర్మించాలనే సమస్య మొదలైంది. అమరావతి ఉంటుందా ఉండదా అన్నదానిపై స్పష్టత లేదు. గతంలో టిడిపి అధికారంలో ఉండగా చేపట్టిన అమరావతిలో అసలు నిర్మాణాలు జరగలేదని, డబ్బు వృధాచేశారని అన్న వాదనలను అధికార వైసిపి నేతలు ముమ్మరం చేశారు. ఇప్పటికీ అమరావతిపై స్పష్టత లేకుండా పాలన సాగిస్తున్నారు.

నవ్యాంధ్ర మొదటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఎన్నికైన తర్వాత రాజధాని అమరావతి నిర్మాణం కోసం రైతుల నుండి వేల ఎకరాలు సవిూకరించారు. నిర్మాణాలు చేపట్టినా, పూర్తి చేయడంలో తీవ్ర అలసత్వం చూపించారు. దీంతో రాజధాని అన్నది లేకుండా పోయింది. జగన్‌ అధికారం చేపట్టిన తరవాత ఇంతటి నిర్లక్ష్యపు ప్రభుత్వ విధానాలు ఎక్కడా ఉండవేమో అన్న చందంగా నడిపిస్తున్నారని టిడిపి విమర్శలు గుప్పిస్తోంది. ఆయన పదవి చేపట్టిన నాటి నుండి రాజధానిని తరలి స్తారనే వాదనతోనే కాలం గడుపుతున్నారు.

ALSO READ :ప్రాంతీయ పార్టీలున్న చోట ఘర్షణలు సృష్టిస్తోన్న బిజెపి…?

ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ ద్వారా నిబంధనలకు విరుద్ధంగా అమరావతి నిర్మాణాలు జరిగాయని, ప్రాజెక్టులలో అవకతవకలు జరిగాయని ప్రాథమిక నివేదిక తెప్పించుకున్నారు. దీంతో రాజధాని తరలింపు తప్పదని సంకేతాలు పంపించడంతో ఇప్పటికే రాజధాని నిర్మాణాలకు ఖర్చు చేసిన వేలకోట్ల రూపాయలు వృధా అయ్యాయి.

భూములు ఇచ్చిన రైతులు ఆందోళనలు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. భూములను అభివృద్ధి చేయకుండా పడావు పెట్టారు. వారికి కూడా ఉపాధి లేకుండా చేశారు. దీనికితోడు రాజధాని నిర్మాణంలోనూ..విధాన ప్రకటనలోనూ కేంద్ర సహకారం అంతంత మాత్రమే. అసలే నిధుల లేమితో కొట్టు మిట్టాడుతున్న రాష్ట్రం మళ్లీ రాజధానిని తరలిస్తే ఎంత నష్టపోతుందో ముఖ్యమంత్రికి తెలియదా అని టిడిపి తదితర విమర్శలు చేస్తున్నాయి.

రాజకీయ లబ్ది కోసం తడవకోసారి రాజధాని మార్చుకుంటూ పోతే రాష్ట్రం అథోగతి పాలవుతుందని హెచ్చరిస్తున్నారు. నాలుగేళ్లలో అభివృద్ది అంటే తెలియకుండా చేశారు. ఎపి ఎంతగా వెనకబడిరతో ఆర్థికస్థితిని బట్టి చెప్పవచ్చు. పెట్టుబడులు రాకుండా పోయాయి. నవ్యాంధ్ర ప్రదేశ్‌ సాధిస్తామని చెబుతున్నా ఎక్కడా అలాంటి ఆనవాళ్లు కానరావడం లేదని టిడిపి విమర్శలకు పదను పెట్టింది. అందుకే అమరావతిలో పెద్దగా పురోగతి కానరాలేదు.

అభివృద్ధి అంటే ఆర్థికాభివృద్ధి మాత్రమే అని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి జలవనరులు దోహద పడతాయి. గోదావరి నదీ జలాలతో రాష్టాన్న్రి సమగ్రంగా అభివృద్ధి చేయవచ్చు. విభజన చట్టంలో జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో గత ప్రభుత్వం హడావిడి చేసింది.

ALSO READ : వేడెక్కుతున్న తెలంగాణ రాజకీయాలు

రూ.33 వేల కోట్లతో చేయవ లసిన పునరావాస పనులకు ప్రాధాన్యత ఇవ్వలేదు. నూతన ప్రభుత్వం వాస్తవాలను ప్రజలకు వివరించి, పునరావాసంతో సహా ప్రాజెక్టును పూర్తి చేయాల్సిన పనులు ముందుకు సాగడం లేదు. గోదావరినదీ జలాలను కృష్ణానదికి తరలింపుపై నిపుణులతో, అఖిల పక్షాలతో చర్చించిన తరువాత నిర్ణయాలు చేయాలి.

ఉత్తరాంధ్రాలో వంశధార, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టులను పూర్తి చేయాలి. ప్రకాశం జిల్లాకు ప్రాణ ప్రదమైన వెలిగొండ ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి. కానీ ఆ దిశగా కార్యాచరణ సాగడం లేదు. 2019 మేలో గెలుపొందిన జగన్మోహనరెడ్డి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు సమగ్ర అభివృద్ధికి దోహదపడేవిగా లేవు.

ఆంధ్రప్రదేశ్‌లో సమగ్ర, సమ్మిళిత, సుస్థిర, మానవాభివృద్ధి జరగాలని ఆర్థిక, సామాజిక శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, రాయలసీమలో కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలను వెనుకబడిన జిల్లాలుగా ప్రకటించి, ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని పేర్కొన్నది.

ఇతర జిల్లాలలో కూడా అనేక ప్రాంతాలు వెనుకబడి వున్నాయి. ప్రకాశం, గుంటూరు జిల్లాలో పల్నాడు ప్రాంతం, తూర్పు గోదావరి జిల్లాలో ఏజెన్సీ ప్రాంతం, పశ్చిమ గోదావరి జిల్లాలో గిరిజన ప్రాంతం, కృష్ణా జిల్లాలో ఎ. కొండూరు, గంపల గూడెం వంటి ప్రాంతాలు వెనుకబడి వున్నాయి. సమాజంలో అన్ని తరగతుల ప్రజలు, వివిధ సామాజిక వర్గాలు అభివృద్ధి చెందితే సమ్మిళిత అభివృద్ధి అవుతుంది.

ఆంధ్రప్రదేశ్‌లో 17 శాతం దళితులు, 6 శాతం గిరిజనులు, 9 శాతం మైనారిటీలు, 47 శాతం బి.సిలు ఉన్నారు. సబళప్లాన్‌ ఉన్నప్పటికి దళితులు, గిరిజనుల అభివృద్ధి ఆశించిన విధంగా లేదు. డెల్టా ప్రాంతాలలో దళితులకు కనీసం స్మశానాలు కూడా లేని ఎన్నో గ్రామాలు ఉన్నాయి. గిరిజన ప్రాంతాలలో వైద్య సదుపాయాలు అందక కిలోవిూటర్ల దూరం నడచి వెళుతున్నారు.

రాష్ట్రంలో సహజ వనరులను ఉపయోగించు కొని సుస్థిర అభివృద్ధి సాధించాలి. సహజ వనరులు దోపిడీ చేయడానికి అభివృద్ధి పేరుతో పర్యావరణ విధ్వంసానికి ప్రయత్నం జరుగుతున్నది. రాష్ట్రంలో కడప జిల్లాతో సహా అనేక ప్రాంతాలలో
జరుగుతున్న యురేనియం తవ్వకాలు దీనికి ఒక ఉదాహరణ. ఉత్తరాంధ్రలో బాక్సైట్‌ గనులను దోపిడీ చేయడానికి జిందాల్‌ వంటి కంపెనీలు ప్రయత్నిస్తూనే ఉన్నాయి.

ఇసుక మాఫియా ప్రకృతిని, నదులను నాశనం చేస్తున్నది. అటవీ ప్రాంతాన్ని విధ్వంసం చేస్తున్నారు. రాష్ట్రంలో అటవీ ప్రాంతం 19 శాతం మాత్రమే ఉన్నది. పర్యావరణ సమతుల్యానికి 33 శాతం అడవులు అవసరం. ప్రకృతి వనరులను కాపాడుకొంటూ భావితరాలకు ఉపయోగపడే విధంగా సుస్థిర అభివృద్ధి కొనసాగించాలి.

కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ప్రభుత్వం వీటిని పట్టించుకోవడంలేదని టిడిపి, లెఫ్ట్‌ తదితర పార్టీలు విమర్వలు చేస్తున్నాయి. తాను పట్టిన కుందేటికి మూడే కొమ్ములు అన్న చందంగా ముందుకు సాగుతున్న తీరు ఎపిని ముందుకు తీసుకుని పోవడంలో విఫలం అయ్యింది.