వేడెక్కుతున్న తెలంగాణ రాజకీయాలు
బిఆర్‌ఎస్‌కు దీటుగా విపక్షాల దూకుడు
యాత్రలతో ప్రజల చెంతకు వస్తున్న పార్టీలు
పరస్పర విమర్శలతో సమస్యలపై పోరు
హైదరాబాద్,ఏప్రిల్19: తెలంగాణలో రాజకీయ సవిూకరణాలు మారుతున్నాయి.కొత్తగా రాజకీయ పార్టీలు బలప్రదర్శనలతో ఎండాకాంలో వేడెక్కిస్తున్నాయి. ఎన్నికలకు మరో ఆరు నెలల గడువు మాత్రమే ఉండడంతో రాజకీయ పార్టీలు ఎవరికివారు తమ వ్యూహాలతో రంగంలోకి దిగాయి. అందరి లక్ష్యం అధికారమే కావడంతో నేతలంతా ప్రజల వద్దకు వెళుతున్నారు.
మొన్నటి వరకు టిఆర్‌ఎస్ కేంద్రంపై ధాన్యం కొనుగోళ్ల యుద్దం చేసింది. ఆ తరవాత ఇప్పుడు పార్టీ వ్యవస్థాపక దినోత్సవానికి సిద్దం అవుతోంది. ఈ సమావేశంతో మరోమారు కేంద్రంపై యుద్దం ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే బిజెపి అధ్యక్షుడు బండి అధ్యక్షుడు పాదయాత్ర ఒకవైపు..షర్మిల యాత్ర మరోవైపు..కాంగ్రెస్ ఆందోళనలు రాజకీయ వేడి పుట్టించాయి.
ఇప్పుడు కాంగ్రెస్ నేత భట్టి పాదయాత్ర సాగుతోంది. కేంద్రంపై యుద్దం ప్రకటించిన బిఆర్‌ఎస్ రాష్ట్ర సమస్యలను విస్మరించి పనిచేస్తోంది. పేపర్ లీకేజీలో పరువు పోగొట్టుకుంది. ఇంతకాలం బిఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం లేదనుకుంటున్న దశలో అనూహ్యంగా బిజెపి దూసుకుని వచ్చి దుబ్బాక, హుజూరాబాద్‌లతో దెబ్బకొట్టింది.
రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ అయ్యాక మరింత వేడి రాజుకుంది. షర్మిల ఒక్కసారిగా దూసుకుని రావడంతో రాజకీయాలు మారుతున్నాయి. ఆమె తెలంగాణ ప్రజల పక్షాన పోరాడుతానని అంటున్నారు. ఆమె పాదయాత్రకు కూడా అనూహ్య స్పందన వచ్చింది. వైఎస్ తనయ షర్మిల కేవలం వైఎస్ అభిమానులను మాత్రమే అట్రాక్ట్ చేయగలదు. అయితే ఆమె పాత్ర పరిమితమా.. లేక ప్రభావితం చేయనుందా.. అన్నది మున్ముందు తేలనుంది.
ALSO READ: దేశంలో 70 వేల టీఎంసీల నీరు అందుబాటులో…
అయితే తాజా రాజకీయాలు ఏ మేరకు ప్రజల అవసరాలను, ఆకాంక్షలను తీరుస్తాయన్నది అంచనా వేయాల్సి ఉంది. వీరి పోరుబాటులో రాజకీయ రణాలు తప్పప్రజల ఆకాంక్షలు మాత్రం తీరడంలేదు. ఇంతకాలం అధికార బిఆర్‌ఎస్‌కు తిరుగు లేకుండా పోయింది. దీనికి తోడు బిజెపి కేవలం విమర్శలకే పరిమితం కావడం మినహా ప్రజలపై పెద్దగా ప్రభావ శీలంగా పనిచేయలేక పోతున్నది. వారు ఎంతగా ప్రయత్నించినా కేంద్ర నిర్ణయాలతో ప్రజలు వ్యతిరేకతను
చూపుతున్నారు.
కెసిఆర్ విూద ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకునే ప్రతయ్నం తప్ప దేశంలో అధికారంలో ఉన్న పార్టీగా ప్రజలకు జరగుతున్న ప్రయోజనాలు కానరావడం లేదు. ఇకపోతే తెలంగాణలో పిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డి కూడా గట్టిగానే పోరాడు తున్నారు. దీంతో కాంగ్రెస్ రాజకీయాల్లో అనూహ్య మార్పులు కనిపించబోతున్నాయి.
యువకుడైన రేవంత్ పట్ల యూత్ అట్రాక్ట్ అవుతోంది. కాంగ్రెస్‌లో ఉన్న గ్రూపులు కూడా ఆయనతో కలసి రావాల్సి ఉంటుంది. గతంలో లాగా గోచీ గుంజే ప్రయత్నాలు ఆదిలోనే అడ్డుకట్ట వేస్తున్నారు. ఎందుకంటే మారుతున్న రాజకీయ పరిణామ క్రమంలో పార్టీని బలోపేతం చేయడం లక్ష్యంగా రేవంత్ సవిూకరణాలను మార్చుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. యూత్‌లో మంచి పాలోయింగ్ ఉండడం, మాస్ లీడర్‌గా పేరుండడం, మంచి వక్త కావడం ఆయనకు కలసి వచ్చే అవకాశం ఉంది.
అంతే గాకుండా కాంగ్రెస్‌ను వీడిని వారు సైతం వెనక్కి వచ్చేలా ప్రయత్నాలు సాగుతున్నాయి. తెలంగాణలో ఇప్పుడు పరిస్థితుల్లో ఆంధ్రా నాయకులకు పెద్దగా అండ దక్కక పోవచ్చు. కాంగ్రెస్ అసంతృప్తులు కూడా ఇప్పుడు రేవంత్‌ను అనుసరించడం ఖాయం. అలాగే వైఎస్ అభిమానులు కూడా రేవంత్ వెంటే ఉండడానికి ఇష్ట పడతారు. ఎందుకంటే షర్మిలకు ఉన్న మైనస్ పాయింట్లు అనేకం ఉన్నాయి.
ALSO READ: డాలర్‌తో 18 పైసలు తగ్గిన రూపాయి మారకం విలువ
ఇకపోతే తెలంగాణ ఉద్యమం లో ముందువరసలో ఉన్న అనేకమంది ఉద్యమకారులు, యువత, నిరుద్యోగులు ఇప్పటికీ కెసిఆర్‌ను వ్యతిరేకిస్తున్నారు. ఉద్యమ సమయంలో అందరినీ కదిలించిన ప్రొఫెసర్ కోదండరామ్ సైతం వెనకబడి పోయారు. ఆయన ఎలాంటి పిలుపు ఇచ్చినా పెద్దగా స్పందన కానరావడం లేదు.
ఈ దశలో మరో సంఘటిత రైతాంగ ఉద్యమం అవసరం ఎంతైనా ఉందని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండ రామ్ అన్నారు. దోపిడీ నుంచి రైతులకు రక్షణ కోసం కొత్త ఉద్యమానికి అందరూ ఏకం కావాలని కోదండరామ్ అంటున్నారు. ఇకపోతే తెలంగాణలో కెసిఆర్ రాజకీయ వ్యూహాలను తక్కువగా అంచనా వేయలేం.
ఎపిలో జగన్‌కన్నా కెసిఆర్ మంచి రాజకీయ వ్యూహకర్త. ఆయన ముందు ఎవ్వరైనా దిగదుడుపే. ఆయన పాచిక వేసారంటే తట్టుకోవడం కష్టమే. ఈటెలను బటయకు పంపినా దాని ప్రభావం పడకుండా జాగ్రత్త పడ్డారు. అందుకే ఎదుటి పక్షాలను దునుమాడే లక్ష్యంతో టిఆర్‌ఎస్ గతంలో ఎప్పుడూ లేనంతగా దృష్టి సారించింది. చివరి గెలుపు వరకు వ్యూహాత్మకంగా అడుగుల వేసేలా పార్టీ శ్రేణులను కెసిఆర్ దిశానిర్దేశం చేస్తుంటారు.
రైతులకు మద్దతుగా కెసిఆర్ ఉద్యమం చేయడం, రైతులకు అండగా ధాన్యం సేకరణ చేయడం వంటి నిర్ణయాలు కూడా రాజకీయంగా కలసివచ్చేవే. అలాగే తన జాతీయ ఆకాంక్షలను సీఎం కేసీఆర్ ఇప్పటికే సుస్పష్టంగా వెల్లడిరచారు. కానీ కెసిఆర్‌ను వెన్నంటి వచ్చేందుకు ఎవరు కూడా కదలడం లేదు.
జాతీయ స్థాయిలో ఎవరు కూడా పెద్దగా కదలి రావడం లేదు. కెసిఆర్ ఇప్పుడు తాజా రాజకీయల నేపథ్యంలో మరోమారు చురుకుగా వ్యవహరించడం ద్వారా జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెడుతున్నారు.
రాజకీయంగా కేంద్రాన్ని గట్టిగా ఢీకొనే ప్రయత్నాల్లో కెసిఆర్ ఉన్నారు. కెసిఆర్‌ను, బిఆర్‌ఎస్‌ను ఢీకొనే యత్నాల్లో విపక్షాలు ఉన్నాయి. ఈక్రమంలో ప్రజల సమస్యలు ఏ మేరకు పరిస్కారం అవుతాయన్నది అనుమానంగానే ఉంది.