బాలికకు 43ఏళ్ల వ్యక్తి వేధింపులు.. కారణం ఇదే!

వెబ్‌డెస్క్: ఆధునిక సమాజంలో ‘మనిషి’ విలువలను మంటగలుపుతున్నాడు. కామంతో కల్లుమూసుకుపోయి కూతురు వయస్సున్న బాలికలను వేధింపులకు గురిచేస్తున్నారు. తన మాట వినకపోతే చంపడానికి కూడా వెనుకాడటం లేదు. ఇలాంటి ఘటనలు ఈ మధ్యకాలంలో చాలా పెరిగాయి. ఈ నేపథ్యంలోనే తనను పెళ్లిచేసుకోవాలని 43 ఏళ్ల వ్యక్తి మైనర్‌ను రోజూ వేధింపులకు గురిచేస్తున్నాడు. తాను చెప్పినట్లు చేయకపోతే మంత్రాలు చేసి కుటుంబంలోని అందరినీ చంపుతానంటూ బాధితురాలిని బెదిరించాడు.
ఈ ఘటన హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పరిధిలో శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకివెళితే.. రాకేష్(43) అనే వ్యక్తి గత కొంతకాలంగా ఓ మైనర్‌తో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. తనను పెళ్లిచేసుకోవాలని లేనియెడల పూజలు చేసి అందర్ని చంపేస్తానని బెదిరింపులకు గురిచేశాడు. దీంతో ఆ బాలిక భయాందోళనకు గురైంది. విషయం తెలుసుకున్న తల్లి నిందితునిపై బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.