Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

దేశంలో 70 వేల టీఎంసీల నీరు అందుబాటులో…

సమస్యలను చర్చించే రాజకీయాలు రావాలి !
భారతీయ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయమే అత్యంత కీలకం. వ్యవసాయంలో ఎగుమతి, దిగుమతుల విధాన సరిగా లేదన్న వాదన ఉంది. ఇబ్బడిముబ్బడిగా దిగుమతులుకూడా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్నాయి.

దేశంలో పండుతున్న పంటలకు డిమాండ్‌ ఉన్నా సమగ్ర ఎగుమతుల విధానం లేకపోవడం..పంటలను సకాలంలొ కొనుగోలు చేసేలా పటిష్ట విధానం నేటికీ లేదు. పంటలు రాగానే అమ్మడం కోసం రైతులు పడుతున్న యాతన అంతా ఇంతా కాదు.

మన దేశం నుంచి ఎగుమతి చేసే విధానం రావాలని, దేశాన్ని పంట కాలనీలుగా విభజించాలని, పంటల మార్పిడి విధానం పాటించాలని కెసిఆర్‌ ఈ మధ్య కాలంలో జాతీయ అంశంగా వ్యవసాయాన్ని తీసుకుంటున్నారు. వ్యవసాయం, నీటి వినియోగంపై బాగా మాట్లాడుతున్నారు.

దేశంలో 70 వేల టీఎంసీల నీరు అందుబాటులో ఉంది. 40 కోట్ల ఎకరాలు సాగవుతున్నాయని అనుకున్నా.. ఇంకా 30 వేల టీఎంసీల నీరు మిగులు ఉంటుంది. ఈ విషయాలు నేను చెప్పినా ప్రధాని మోదీ పట్టించు కోవడం లేదని పలు సందర్భాల్లో కేసీఆర్‌ వ్యాఖ్యలు చేశారు.

ALSO READ: ఇఫ్తార్ విందు లో పాల్గొన్న వైఎస్ షర్మిల

తాము అధికారంలో భాగస్వామిగా ఉంటేనే తాము అనుకున్న పనులు జరుగుతాయన్నది కెసిఆర్‌ బలంగా నమ్ముతున్నారు. బీజేపీ ఏకపక్ష..నిరంకుశ రాజకీయాలను అడ్డుకునేందుకు జాతీయ పార్టీ ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్‌ కేంద్రంతో వచ్చేది ఒక తమ ప్రభుత్వమే అని ప్రకటించారు.

అప్పుడే దేశంలో తెలంగాణ తరహా వ్యవసాయ విధానం అమలవుతుందని.. రైతులు కష్టాల నుంచి గట్టెక్కుతారని నమ్ముతున్నారు. అయితే కెసిఆర్‌ను రాష్ట్రంలోనూ నిలువరించేం దుకు బిజెపి పావులు కదుపుతోంది. బీజేపీ ఇప్పటికే ’ఒకే దేశం.. ఒకే విధానం’ పేరిట అడుగులు వేస్తోంది.

ఈ నినాదంతోనే జమిలి ఎన్నికలకు వెళ్లడానికి తొలుత పావులు కదిపినా సాధ్యం కాలేదు. అలా ఎన్నికల్లో ఎక్కువ రాష్టాల్ల్రో గెలిచి.. రాజ్యాంగ సవరణ ద్వారా అధ్యక్ష తరహా పాలనకు తెరతీయాలని భావిస్తోందని రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

ఈ విషయాన్ని పసిగట్టిన కేసీఆర్‌.. బీజేపీ నినాదానికి అడ్డుకట్ట వేయడమే కాకుండా జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ శక్తిగా నిలవడానికి పావులు కదుపుతున్నారని తాజా పరిణామాలను గమనిస్తే తెలుస్తోంది. అయితే కలిసి వచ్చే ఇతర ప్రాంతీయ పార్టీలను కూడా కలుపుకుని వెళదామనుకున్నా కెసిఆర్‌కు పెద్దగా అండ దొరకడం లేదు. అందుకే ఆయన రైతు నినాదాన్ని ఎత్తుకు న్నారు.

ఈ మేరకు బీజేపీ యేతర ప్రభుత్వాల సీఎంలతో కేసీఆర్‌ ఇప్పటికే మంతనాలు జరుపుతున్నా పెద్దగా ఫలితం కానరావడం లేదు. పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, జార్ఖండ్‌ సీఎం, జేఎంఎం నేత హేమంత్‌ సోరెన్‌ వంటి నేతలతో చర్చలు జరిపినా కార్యాచరణ కానరాలేదు.

ALSO READ: యాసంగి ధాన్యం రవాణాపై నిఘా ఉంచండి… అదనపు కలెక్టర్… కర్నాటి

ఆదానీ వ్యవహారం, రాహుల్‌పై వేటు వంటి అంశాల కారణంగా అన్ని పార్టీలు అసంతృప్తిగా ఉన్నాయి. అయితే కాంగ్రెస్‌ విపక్ష పార్టీగా విఫలం కావడం కూడా కలసి వచ్చే అంశం. తెలంగాణ ఉద్యమానికి ముందు కూడా కెసిఆర్‌ విద్యుత్‌ బిల్లుల సమస్యతోనే రంగంలోకి దూకి తెలంగాణ సాకారం చేయడంలో విజయం సాధించారు. ఇప్పటికీ ఆయన జాతీయ రాజకీయాల్లో విజయం సాధిస్తామన్న ధీమాతో ఉన్నారు.

ఈ క్రమంలో అబ్‌కీబార్‌ కిసాన్‌ సర్కార్‌ నినాదం మోగిస్తున్నారు. అయితే ఇదొక్కట సరిపోదు. కేంద్ర విధానాలను వ్యతిరేకిస్తున్న ప్రజలను కూడగట్టడం అంత సులవు కాదు. వారందరిని కూడగట్టాలి.

బిజెపి విధానాలను వ్యతిరేకించే పార్టీలతో పాటు సమస్యలను ఎదుర్కొంటున్న ప్రజలను కూడా సవిూకరించాలి. రైతులను చైతన్యం చేయాలి. ఎగుమతిదిగుమతులపై స్పష్టమైన విధానం ప్రకటించాలి.

సమాజంలో అట్టడుగున ఉన్న దళితులు, ఆదివాసీలు, బడుగు బలహీనవర్గాలవారు ఇతర కులాలతో పాటు సమానంగా అభివృద్ది కావడం లక్ష్యంగా ముందుకు సాగాలి. అంటరాని తనం, కుల వివక్ష అంతం కావాలి. బలహీనులపై దాడులు చేసిన మోతుబరులతో రాజీ కుదిర్చే అధికార యంత్రాంగం తీరు మారి, ’చట్టం తన పని తాను చేసుకునేలా’ విధానాల రూపకల్పన జరగాలి.

గిరిజనుల ఆవాసాలకు కనీసం రోడ్డు కూడా లేదని రాష్ట్ర ప్రభుత్వ గణాంకాలు ఘోషిస్తున్నాయి. మహిళపై నేరాలు నానాటికీ పెచ్చరిల్లుతున్నాయి. దళిత, గిరిజన, వెనుక బడిన తరగతులు, మహిళలు, మైనార్టీ తరగతుల సమస్యల పరిష్కారానికి రాయితీలు కల్పించడం మాత్రమే పరిష్కారం కాదు.

శ్రామికులకు, ఆరుగాలం కష్టపడ్డ అన్నదాతలకు శ్రమకు తగిన ప్రతిఫలం దక్కడం లేదు. వారి కష్టఫలితం వారికి దక్కితేనే జీవన ప్రమాణాలు మెరుగవుతాయి. అదే విధంగా కార్మికు లకు కనీస వేతనం 18వేలు చెల్లించడం తోపాటు, కార్మిక చట్టాలను పటిష్టపర్చడం అవసరం.అప్పుడో ఇప్పుడో నష్ట పరిహారం లేదా సబ్సిడీ ఇవ్వడం కాకుండా పంట పండిరచడానికి చేసిన ఖర్చుకు 50 శాతం అదనంగా ధర రైతుకు చెల్లించేలా చట్టం చేయాలి.

కౌలురైతులు, ఉద్యోగ,ఉపాధ్యాయ సమస్యలపట్ల ప్రత్యామ్నాయ కార్యక్రమం స్పష్టమైన డిమాండ్లు రూపొందించింది. యువ ఉద్యోగులు, ఉపాధ్యాయుల మెడ విూద కత్తిలా వేలాడుతున్న సిపిఎస్‌ విధానాన్ని తెచ్చింది వాజ్‌పారు ప్రభుత్వమే. మన్మోహన్‌ సింగ్‌తో పాటు రాజశేఖరరెడ్డి, కిరణ్‌కుమార్‌ రెడ్డి ప్రభుత్వాలు దాన్ని యధాతథంగా అమలు చేశాయి. సిపిఎస్‌ రద్దు చేస్తామని 2014లో హావిూనిచ్చిన చంద్రబాబు ఆ ఊసే ఎత్తలేదు.

పెట్టుబడిదారీ విధానాన్ని అమలు చేస్తున్న ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర పాలక పార్టీలు ఖజానాను సంపన్నులకు దోచిపెట్టడమేగాక అవినీతిని పెంచి పోషిస్తున్నాయి. ప్రపంచబ్యాంకు ఆదేశిత సంస్కరణలు, జలయజ్ఞం వగైరా అవినీతి అందరికీ తెలిసిందే! అవినీతి రహితంగా ప్రభుత్వ పాలన, పారదర్శకంగా నిర్ణయాలు, పంచాయతీలకు మున్సిపాలిటీలకు నిధులు వంటి అంశాలను ప్రత్యామ్నాయ కార్యక్రమం పేర్కొంది.

రాజకీయ అవినీతిని అంతం చేయడం ప్రత్యామ్నాయ శక్తులకే సాధ్యం. ఎన్నికల సంస్కరణలు, ప్రధానంగా దామాషా ఎన్నికల విధానం నేటి అవసరం.

మౌలికమైన భూమి సమస్య మొదలు విశ్వ వ్యాపితమైన పర్యావరణ అంశం వరకు అనేక విషయాలపై ప్రత్యామ్నాయ కార్యక్రమం పూర్తిగా సామాన్య పజల కోర్కెలను ప్రతిబింబించేదిగా వుండాలి. సంపన్నుల కొమ్ముకాసే చర్యల వల్ల కొద్దిమంది కోటీశ్వరులవుతున్నారు. కాబట్టి ఈ విధానాలకు ప్రత్యామ్నాయం రావాలి. అది ప్రత్యా మ్నాయ రాజకీయ విధానాల ద్వారానే సాధ్యం.