ఆర్జిత సేవల క్యాలెండర్‌ను ప్రకటించిన టిటిడి

శ్రీవారి భక్తులకు శుభవార్త
తిరుమల,ఏప్రిల్18: కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. ఆర్జిత సేవలు, ఎలక్టాన్రిక్ డిప్, ప్రత్యేక ప్రవేశ దర్శనం, వసతి గదుల కోటా విడుదలకు సంబంధించిన షెడ్యూల్‌ను ప్రకటించింది.
ఇంతకు ముందు ఆయా సేవలకు సంబంధించి ఎప్పుడు విడుదల చేయనున్నదో.. ఆయా తేదీలను వేర్వేరుగా ప్రకటించేది.
తాజాగా ఒకేసారి క్యాలెండర్‌ను ప్రకటించింది. ఈ మేరకు భక్తులు ఆన్‌లైన్‌లో టికెట్లను బుక్ చేసుకొని.. సహకరించాలని విజ్ఞప్తి చేసింది.
ఎలక్టిక్ర్ డిప్ : జూలై మాసానికి సంబంధించి ఆర్జిత సేవా టికెట్ల కోటాను ఏప్రిల్ 20వ తేదీ ఉదయం 10 గంటల నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది. రిజిస్టేష్రన్ 22న ఉదయం 10 గంటల వరకు అందుబాటులో ఉంటుందని పేర్కొంది. అదే రోజు మధ్యాహ్నం 12గంటలకు డిప్ అలాట్‌మెంట్‌ను ప్రకటించ నున్నట్లు పేర్కొంది.
జూలై మాసానికి సంబంధించిన కల్యాణం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సహా తదితర ఆర్జిత సేవా టికెట్ల కోటాను ఈ నెల 20న ఉదయం 11.30 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు టీటీడీ తెలిపింది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు విడుదల చేయనున్నట్లు చెప్పింది.
ALSO READ: హైదరాబాద్ విభిన్న సంస్కృతుల సమ్మేళనం
జూలై నెలకు సంబంధించిన అంగ ప్రదక్షిణం టోకెన్లను ఈ నెల 21న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు చెప్పింది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు దివ్యాంగులు, వృద్ధులకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం కోటాను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు చెప్పింది.
వర్చువల్ సేవలు : మే, జూన్ మాసాలకు సంబంధించి వర్చువల్ కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవల టికెట్ల కోటాను 24న ఉదయం 10 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలిపింది.
ప్రత్యేక ప్రవేశ దర్శనం : మే మాసానికి సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను 25న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. మే నెలకు సంబంధించి తిరుమలలో వసతి గదుల కోటాను ఈ నెల 26న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు టీడీపీ వెల్లడిరచింది. 2
7న తిరుపతిలోని వసతి గదుల కోటాను విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వివరించింది.