Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

హైదరాబాద్‌ విభిన్న సంస్కృతుల సమ్మేళనం

ఇది తమ సొంత ఇల్లుగా భావిస్తున్న ప్రజలు
సిట్‌కో యూనిట్‌ ప్రారంభోత్సవంలో కెటిఆర్‌
హైదరాబాద్‌,ఏప్రిల్‌18: హైదరాబాద్‌ నగరం విభిన్న సంస్కృతుల సమ్మేళనం అని.. దేశంలోని ప్రజలు అంతా తమ ఇంట్లో ఉన్నట్లుగా ఇక్కడ భావిస్తున్నారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. గత తొమ్మిదేండ్లలో సాంకేతిక రంగంలో ఉద్యోగుల సంఖ్య 3.25 లక్షల నుండి 10 లక్షలకు పెరిగిందని తెలిపారు.

హైదరాబాద్‌ నాలెడ్జ్‌ సిటీలో గ్లోబల్‌ ఆల్టర్నేటివ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అసెట్స్‌ సర్వీస్‌ సిట్‌కో కొత్త యూనిట్‌ను మంత్రి కేటీఆర్‌ మంగళవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. హైదరాబాద్‌ అన్ని సంస్కృతులను స్వాగతిస్తుంది.

ALSO READ: పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో హనుమాన్‌

అర్ధంలేని మాటలకు, ద్వేషం, హింసకు ఇక్కడ చోటు లేదు. ఇక్కడ లా అండ్‌ ఆర్డర్‌ కఠినంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా విద్య, అకడమిక్‌, ఇన్నోవేషన్‌, పర్యావరణ వ్యవస్థలు పగడ్బందీగా ఉన్నాయని మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

ఇమేజ్‌ టవర్స్‌, యానిమేషన్‌, గేమింగ్‌, మల్టీవిూడియా కోసం ఇక్కడ ఒక కేంద్రం నిర్మించబడుతోందని మంత్రి పేర్కొన్నారు. ఇది 18 ఎకరాల్లో విస్తరించి ఉండగా.. ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్‌ క్యాంపస్‌ అవుతుంది.

దీనికి హైదరాబాద్‌ను ఎంపిక చేసుకుని సిట్‌కో తెలివైన పని చేసిందన్నారు. సిట్‌కో మనీలాలో 3500 మంది ఉండగా, టోరంటో కేంద్రంలో 2500 మందే ఉన్నారు.

హైదరాబాద్‌లో అమెజాన్‌ అతిపెద్ద క్యాంపస్‌, మైక్రోసాప్ట్‌, మెటా, యాపిల్‌, గూగుల్‌, ఉబెర్‌, మైక్రోన్‌, క్వాల్‌కామ్‌ వంటి సంస్థల రెండవ అతిపెద్ద క్యాంపస్‌కు నిలయంగా హైదరాబాద్‌ మారిందన్నారు.

ఈ క్రమంలో సిట్‌కోకు చెందిన ప్రపంచం లోనే రెండో అతిపెద్ద క్యాంపస్‌ హైదరాబాద్‌లో ఉండాలని, దానిని సాకారం చేద్దాం అని కేటీఆర్‌ చెప్పారు.