పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో హనుమాన్
తేజ సజ్జ హీరోగా అమృతా అయ్యర్ హీరోయిన్ గా రూపొందుతున్న ’హను`మాన్’ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలోనే కాకుండా విదేశీ భాషల్లో కూడా పెద్ద ఎత్తున విడుదల చేసేందుకు గాను ప్రయత్నాలు చేస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని దేశ విదేశాల్లో అనువుగా ఉండే విధంగా ఒక విడుదల తేదీని ప్రకటించే అవకాశాలు ఉన్నాయి అంటూ సమాచారం అందుతోంది.
ALSO READ: కమెడియన్ అల్లు రమేశ్ మృతి
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే… అంజనాద్రి ని కాపాడేందుకు హీరో రూపంలో హనుమంతుడు వస్తాడు. హీరో తేజ కు అతీత శక్తులు వచ్చిన సమయంలో సినిమా అద్భుతంగా ఉంటుంది అంటూ యూనిట్ సభ్యులు ఆఫ్ ది రికార్డ్ చెబుతున్నారు.
అంజనాద్రిని కాపాడేందుకు హీరో రూపంలో ఉన్న హనుమంతుడు చేసే పోరాటాల్లో
వీఎఫ్‌ఎక్స్ విజువల్ వండర్ గా ఉంటాయని కూడా పేర్కొన్నారు. విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ కాన్సెప్ట్ తో సినిమాను ఎంపిక చేసుకోవడం పట్ల మొదట్లో కొందరు ట్రోల్స్ చేశారు.
కానీ సినిమా యొక్క టీజర్ మరియు పోస్టర్స్ ను విడుదల చేసిన తర్వాత ప్రభాస్ చేసిన ఆదిపురుష్ సినిమాకు ఏమాత్రం తక్కువ లేదనే టాక్ వచ్చింది. కొందరు ఆదిపురుష్ కంటే కూడా హను మాన్ బాగుంటుందనే నమ్మకంతో ఉన్నారు. అతి త్వరలో విడుదల తేదీని ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.