మూడు సినిమాలు అనౌన్స్… పవన్ అభిమానులు ఖుషీ
చిత్రాలను పూర్తి చేసే పనిలో పవన్
రానున్న ఎలక్షన్‌లలోపు వీలైనన్ని సినిమాలను పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ తన డేట్స్‌ను పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నాడు. గతేడాది కేవలం హరిహర వీరమల్లు ఒకటే చేతిలో ఉందనుకుంటే ఒకేసారి మూడు సినిమాలను అనౌన్స్ చేయడంతో పవన్ అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు.
పవన్‌కళ్యాణ్ లైనప్‌లో కాస్త ఎక్కువ ఎగ్‌జైట్‌మెంట్ చేస్తున్న సినిమా ఓజీనే. పవన్ అభిమానులే కాదు.. ప్రేక్షకులు సైతం ఈ సినిమాపై ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు . సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాపై ఇప్పటికే ఎక్కడలేని బజ్ నెలకుంది.
ALSO READ: దాస్ కా ధవ్కిూకి సీక్వెల్
ఒక్క ప్రీ లుక్ పోస్టర్‌కే సోషల్ విూడియా షేక్ అయిందంటే ఏ రేంజ్‌లో ఈ సినిమాపై అంచనాలున్నాయో అర్థం చేసుకోవచ్చు. గత వారంఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ముంబైలో తొలి ఎపిసోడ్‌ను స్టార్ట్ చేశారు. కాగా తాజాగా పవన్ కళ్యాణ్ ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్ అయ్యాడు. ఇదే విషయాన్ని చిత్రబృందం అభిమానులతో పంచుకుంది. పవన్ కళ్యాణ్ ఓజీ సెట్స్‌లోకి అడుగుపెట్టినట్లు ఆయన ఫోటోను సోషల్ విూడియాలో షేర్ చేసింది.
ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. గ్యాంగ్‌స్టర్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. ఆర్‌ఆర్‌ఆర్ వంటి ఇండస్టీ హిట్‌ను నిర్మించిన
దానయ్య ఈ సినిమాకు ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నాడు.
ఈ సినిమా కోసం పవన్ 60రోజుల కాల్షీట్లు ఇచ్చాడని తెలుస్తుంది. దీనితో పాటుగా పవన్ హరిహర వీరమల్లు అనే పీరియాడిక్ సినిమా చేస్తున్నాడు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఇక మేనల్లుడు సాయిధరమ్‌తో కలిసి నటిస్తున్న వినోదయ్ సిత్తం రీమేక్ కూడా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
ఈ సినిమాకు పి. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నాడు. వీటితో పాటుగా పవన్, హరీష్ శంకర్‌తో ఉస్తాద్ భగత్‌సింగ్‌ను కూడా లైన్లో పెట్టాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే షూటింగ్ మొదలుపెట్టనుంది.