Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

విజువల్‌ వండర్‌ గా ప్రభాస్‌ ఆదిపురుష్‌

ప్రభాస్‌ ఆదిపురుష్‌ కోసం అభిమానుల ఎదురుచూపు
వాలి, సుగ్రీవుల మధ్య పోరాట సన్నివేశాల గ్రాఫిక్స్‌ సూపర్‌
ప్రభాస్‌ మోషన్‌ గ్రాఫిక్స్‌ మూవీ ఆదిపురుష్‌ కోసం దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇండియన్‌ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఇండియన్‌ సినీ చరిత్రలో అతి పెద్ద మోషన్‌ గ్రాఫిక్స్‌ మూవీగా ఆదిపురుష్‌ రికార్డ్‌ ను దక్కించుకోబోతుంది.

అద్భుతమైన విజువల్స్‌ ను ఈ సినిమాలో చూపించబోతున్నట్లుగా దర్శకుడు ఓమ్‌ రౌత్‌ చెప్పుకొచ్చాడు. తాజాగా ఈ సినిమా గురించి సోషల్‌ విూడియాలో ప్రచారం జరుగుతున్న ఒక అప్డేట్‌ సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. ఈ చిత్రంలోని వాలి ` సుగ్రీవుల మధ్య పోరాట సన్నివేశం ఉంటుందట.

ఆ సన్నివేశం లో గ్రాఫిక్స్‌ అద్భుతంగా వచ్చాయని యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. విజువల్‌ వండర్‌ గా ఈ సినిమాను రూపొందిస్తున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు మొదటి నుండి చెబుతూ వస్తున్నారు. కానీ ఆ మధ్య టీజర్‌ విడుదల అయిన తర్వాత చిన్న పిల్లల సినిమా అంటూ ట్రోల్స్‌ రావడంతో గ్రాఫిక్స్‌ విషయంలో మరింత శ్రద్ధ తీసుకున్నట్లు తెలుస్తోంది.

ALSO READ: ఈ వారం OTT లో 31 సినిమాలు

జూన్‌ 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ సినిమా కథ పూర్తి స్థాయి రామాయణం కాదని.. రామాయణ ఇతివృత్తం నేపథ్యంలో సాగుతుందని అంటున్నారు. ఇప్పటి వరకు యూనిట్‌ సభ్యులు మాత్రం ఆ విషయంలో క్లారిటీ ఇవ్వలేదు.

ప్రభాస్‌ ను రాముడి పాత్రలో చూడబోతున్న నేపథ్యంలో ఫ్యాన్స్‌ చాలా ఆసక్తిగా ఉన్నారు. గత ఏడాది నుండి వాయిదా పడుతూ వస్తున్న ఆదిపురుష్‌ సినిమా ఈ జూన్‌ లో అయినా విడుదల అవుతుందా అనే అనుమానంతో ప్రభాస్‌ అభిమానులు ఉన్నారు. ఈసారి కచ్చితంగా విడుదల చేసి తీరుతాం అంటూ ఆదిపురుష్‌ యూనిట్‌ సభ్యులు ప్రమోషన్‌ కార్యక్రమాలను షురూ చేయడం జరిగింది. మే నెలలో దేశ వ్యాప్తంగా యూనిట్‌ సభ్యులు పర్యటించి ప్రచారం చేయబోతున్నారు.
ఈ సినిమా లో ప్రభాస్‌ కు జోడీగా సీత పాత్రలో కృతి సనన్‌ నటించింది. రావణుడి పాత్రలో బాలీవుడ్‌ స్టార్‌ నటుడు సైఫ్‌ అలీ ఖాన్‌ నటించాడు. మొత్తానికి ఈ సినిమా కోసం మొత్తం ఇండియన్‌ సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పాజిటివ్‌ రెస్పాన్స్‌ వస్తే రికార్డులన్నీ కూడా బ్రేక్‌ అయ్యేలా వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్స్‌ నమోదు అవ్వడం ఖాయం.