Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

కుట్రలు, కుతంత్రాలు తప్ప మరోటి తెలియని బిజెపి

తొమ్మిదేళ్ల కెసిఆర్‌ పాలనలో ఎన్నో అద్భుతాలు
చెప్పడానికి వందల పథకాలు..కార్యక్రమాలు
బిజెపి చెప్పుకోవడానికి ఒక్కటైనా ఉందా
రాష్ట్రంలో మళ్లీ బిఆర్‌ఎస్‌దే హ్యీట్రిక్‌ విజయం
చౌటుప్పల్‌ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీష్‌ రావు
దేశం యావత్తూ తెలంగాణ వైపు చూస్తోందన్న జగదీశ్‌ రెడ్డి
యాదాద్రిభువనగిరి,ఏప్రిల్‌18: తొమ్మిదేళ్లలో తెలంగాణలో సిఎం కెసిఆర్‌ చేసిన పనులు చెప్పడానికి వంద ఉన్నాయని..అదే బిజెపి ఏంచేసిందో ఒక్కటైనా చెప్పగలదా అని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు సవాల్‌ చేశారు.

ఎమ్మెల్యేలను కొనుడు..ప్రభుత్వాలను పడగగొట్టుడు, గుడ్డువిూద ఈకలు పీకుడు తప్ప మరో మంచిపని బిజెపి చేసిందా అని ప్రశ్నించారు. కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ అన్ని రంగాల్లో తెలంగాణపై వివక్ష చూపుతున్నదని మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు.

చౌటుప్పల్‌లో విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీ లింగయ్యయాదవ్‌, ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి, ఇతర నాయకులతో కలిసి హరీశ్‌రావు బిఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ కుట్రల పార్టీ అని విమర్శించారు. బిఆర్‌ఎస్‌ పార్టీ ప్రజల కోసం సంక్షేమ పథకాలను అమలు చేస్తుంటే.. బీజేపీ అధికారం కోసం పన్నాగాలు పన్నుతోందని, బిఆర్‌ఎస్‌ వి పథకాలైతే, బిజెపివి పన్నాగాలని మండిపడ్డారు.

బీజేపీ పన్నాగాలను ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి విషయంలో దేశంలో తెలంగాణతో పోటీపడే రాష్ట్రం ఏదైనా ఉందా అని మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. తెలంగాణలో రూ.2 వేల పెన్షన్‌ ఇస్తుంటే.. డబుల్‌ ఇంజిన్‌ సర్కారు ఉన్న గుజరాత్‌లో మాత్రం కేవలం రూ.600 మాత్రమే ఇస్తున్నారని ఎద్దేవా చేశారు.

భారతీయ జనతాపార్టీ విద్యార్థుల జీవితాలతో ఆటలాడు కుంటున్నదని విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా మూడోసారి కూడా బిఆర్‌ఎస్‌ పార్టీదే అధికారమని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ పాలిత రాష్టాల్లో గనకల్చర్‌.. బీఆర్‌ఎస్‌ పాలనలో ఉన్న రాష్ట్రంలో అగ్రికల్చర్‌ ప్రధానమైనవిగా ఉన్నాయని మంత్రి ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో రైతుల సంపద పెంచిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.

ALSO READ: భారత్‌లో యాపిల్‌ తొలి రిటైల్‌ స్టోర్‌

సీఎం కేసీఆర్‌ తీసుకొచ్చిన రైతు సంక్షేమ పథాకాలవల్లే తెలంగాణలో భూముల విలువ పెరిగిందన్నారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎరువలు కొట్లాట ఎక్కడైనా ఉందా అన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రైతులు ఎరువుల కోసం మళ్లీ లైన్‌లలో నిలబడాల్సిన పరిస్థితి వస్తుందని మంత్రి పేర్కొన్నారు.

నలభై ఏండ్లు పాలించిన కాంగ్రెస్‌ పార్టీ ప్రజల కోసం రైతుబంధు, కల్యాణలక్ష్మి లాంటి పథకాలను ఎందుకు తీసుకురాలేదన్నారు. ఆనాడు ఏవిూచేయలేకపోయిన నేతలు మళ్లీ మేమొస్తామంటున్నారని అన్నారు. మునుగోడులో కూసుకుంట్లను గెలిపించినట్లుగానే మరోమారు రాష్ట్రంలో బిఆర్‌ఎస్‌ గెలిపించే బాధ్యత విూదేనని అన్నారు.

మునుగోడు ఉపఎన్నికల్లో తమ పార్టీఇచ్చిన ప్రతి హావిూని నెరవేరుస్తామని మంత్రి హరీష్‌ రావు అన్నారు. టీఆర్‌ఎస్‌ కు మొదటి విజయం సిద్దిపేట అయితే.. బీఆర్‌ఎస్‌కు తొలి విజయం మునుగోడు గడ్డకే దక్కిందని తెలిపారు. తెలంగాణలో మళ్లీ బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తుందని, హ్యాట్రిక్‌ కొట్టడం ఖాయమని స్పష్టం చేశారు.

కేసీఆర్‌ పాలనలో రైతుకు విలువ పెరిగిదని అన్న హరీష్‌… దాంతోనే భూముల విలువ పెరిగిందని తెలిపారు. ఇక్కడ నీళ్లు ఇవ్వడంతో పాటు రైతుబంధు, రైతుబీమా ద్వారా రైతులకు భరోసా కల్పించామని అన్నారు. ప్రపంచమే అబ్బుర పడేలా యాదాద్రి ఆలయ నిర్మాణం జరిగిందన్నారు.

తెలంగాణలో ఇస్తున్నట్లు డబుల్‌ఇంజన్‌ సర్కార్‌ ఉన్న రాష్టాల్ల్రో తాగునీరు, పెన్షన్లు ఎందుకు ఇవ్వడం లేదని హరీష్‌ ప్రశ్నించారు. పదో తరగతి పేపర్‌ లీకేజీని పట్టుకుని బీజేపీ రాజకీయం చేస్తోందని హరీష్‌ విమర్శించారు. పథకాలు, సంక్షేమం బీఆర్‌ఎస్‌ పార్టీవి అయితే, కుట్రలు, కుతంత్రాలు బీజేపీ పార్టీ అని తెలిపారు.

మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ గడ్డవిూద బీజేపీ కుట్రలు సాగవని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా జగదీశ్‌రెడ్డి బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలపై విమర్శలు గుప్పించారు. తెలంగాణ సంక్షేమం, అభివృద్ధి యావత్‌ భారతానికి పాకిందని, దేశంలోని ఇతర రాష్టాల్ర ప్రజలు కూడా తెలంగాణ వైపు చూస్తున్నారని చెప్పారు.

గుజరాత్‌ సహా బీజేపీ పాలిత రాష్టాల్ల్రో ఇక్కడి పథకాలకు డిమాండ్‌ పెరిగిందని మంత్రి పేర్కొన్నారు. ఆయా రాష్టాల్ర ప్రజలు తిరుగుబాటుకు సన్నద్ధమౌతున్నారని, హస్తిన పీఠం కదులుతుందన్న భయం బీజేపీకి పట్టుకుందని మంత్రి ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అంటేనే ఢల్లీి బాస్‌లకు వణుకు అని వ్యాఖ్యానించారు.

మోదీ సొంత రాష్ట్రంలో దారిద్యం పెరిగిందన్నారు. ఆ రాష్ట్రంలో 35 శాతానికి పైగా జనం అర్థాకలితో అలమటిస్తున్నారన్నారు. గుజరాత్‌ ప్రజలది తాగునీరు కొనుక్కునే దుస్థితిలో ఉన్నారని మండిపడ్డారు. గుజరాత్‌లో ప్రజలకు విద్యుత్‌ సరఫరా కూడా ఆరు గంటలేనని ఎద్దేవా చేశారు.

గుజరాత్‌లో ఆసరా పింఛన్‌ అందేది రూ.600 మాత్రమేనని మంత్రి తెలిపారు. అక్కడ మోటార్లకు విూటర్లు పెట్టి ముక్కుపిండి బిల్లుల వసూలు చేస్తున్నారని చెప్పారు. ఉచిత విద్యుత్‌ మాకెందుకు ఇవ్వడం లేదనే చర్చ దేశవ్యాప్తంగా అన్ని రాష్టాల్లో మొదలైందని, ఇంటింటికి మంచినీరు మాకెందుకు ఇవ్వడం లేదని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారని మంత్రి తెలిపారు.

ALSO READ: శాంతిభద్రతలను పరిరక్షించే పనిలో ఉన్నాం

కళ్యాణాలక్ష్మి/షాది ముబారక్‌, కేసీఆర్‌ కిట్‌, అమ్మవడి పథకాలు మాకెందుకు లేవని జనం ప్రశ్నిస్తున్నారని, దాంతో బీజేపీ నేతల్లో కలవరం మొదలైందని,
ందుకే ఇక్కడ అభివృద్ధిని అడ్డుకునేందుకు మోకాలొడ్డుతున్నారని, సంక్షేమ పథకాలకు అవరోధాలు సృష్టిస్తున్నారని, వాటన్నింటినీ అధిగమించే సత్తా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఉందని మంత్రి చెప్పారు.
బీఆర్‌ఎస్‌ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా కార్యకర్తలు ముందుకు సాగాలాని ఆయన పిలుపు నిచ్చారు. స్వరాష్ట్రం సాధించుకున్న తర్వాతనే రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ లాభం చేకూరిందన్నారు. గులాబీ జెండా నీడలోనే అభివృద్ధి, సంక్షేమం సాగుతున్నాయని చెప్పారు.

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో లబ్ది పొందిన మొదటి జిల్లా ఉమ్మడి నల్లగొండ జిల్లా అని, అందుకే నల్లగొండ జిల్లా ఎప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అండగా ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలోని 12 కు 12 అసెంబ్లీ స్థానాల్లో గులాబీ జెండాలు ఎగరడం పెద్ద రికార్డు అన్నారు.

నెహ్రూ హయాంలో కాంగ్రెస్‌ పార్టీకి కూడా ఇంతటి గౌరవం దక్కలేదన్నారు. చంద్రబాబు హయాంలోనూ పచ్చ పార్టీకి సింగిల్‌ డిజిటే వచ్చిందని చెప్పారు.
గులాబీ పార్టీ అధికారంలోకి వచ్చాకే జిల్లా సస్యశ్యామలం అయ్యిందని, 47 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తున్నదని మంత్రి తెలిపారు. ఉచిత విద్యుత్‌తో ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతన్న కండ్లలో బీఆర్‌ఎస్‌ వెలుగులు నింపిందని మంత్రి పేర్కొన్నారు.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మరో పార్టీకి తావు లేదని, ఆత్మీయ సమ్మేళనాలు గులాబీ శ్రేణుల బాంధవ్యాలను పెంపొందిస్తున్నాయని చెప్పారు. కాంగ్రెస్‌ హయాంలో ఎండా కాలం వస్తే రాష్ట్రంలో కరెంటు కోతలే ఉండేవని మంత్రి జగదీశ్‌రెడ్డి ఎద్దేవా చేశారు.

ప్రజలను ఓటు అడిగే హక్కు బీఆర్‌ఎస్‌ నేతలకే ఉన్నదని చెప్పారు. నాడు సాగర్‌ జలాలను ఆంధ్రాకు తరలిస్తుంటే కాంగ్రెస్‌ నేతలు ప్రశ్నించారా..? అంటూ మంత్రి నిలదీశారు. తెలంగాణ ప్రయోజనాలను పక్కనపెట్టి ఇక్కడి కాంగ్రెస్‌ నేతలు పదవుల కోసం వెంపర్లాడారని విమర్శించారు.