వివేకా హత్యకేసులో సునీత భర్తపైనా అనుమానాలు

విచారణ సజావుగా సాగాలనే కోరుకుంటున్నాం
విజయకుమార్ స్వామి రాకపై తప్పుడు ప్రచారాలు
విూడియా సమావేశంలో టిటిడి ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి
అమరావతి,ఏప్రిల్18: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచిన నేపథ్యంలో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. ఈ క్రమంలో వివేకా కేసులో చట్టం తనపని తాను చేసుకుపోతుందన్న విశ్వాసం ఉందని టీటీడీ చైర్మన్ వైవీసుబ్బారెడ్డి అన్నారు.
నిజాలు తేల్చే పద్దతిలో విచారణ జరగాలన్నారు. వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో ఒత్తిడులు ఉన్నాయని అనిపిస్తుందని అభిప్రాయపడ్డారు. వివేకాకు ఉన్నవేరే సంబంధాల గురించి ఫోటోలు చూస్తున్నామని… సునీత భర్త రాజశేఖర్ రెడ్డి పాత్రపై కూడా విచారణ జరపాలని వైవీ సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు.
ALSO READ: క్యాన్సర్ రోగులకు ఉచితంగా కీమో థెరఫీ
లాబియిస్ట్ విజయ్‌కుమార్‌ను సీఎం జగన్ మోహన్ రెడ్డి తన వద్దకు పిలిపించుకున్నారంటూ వస్తున్న వార్తలను వైవీసుబ్బారెడ్డి ఖండిరచారు. మంగళవారం విూడియాతో మాట్లాడుతూ… కొన్ని పత్రికలు ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నాయన్నారు.
విజయ్‌కుమార్ స్వామిని, కడప ఎంపీ అవినాష్ రెడ్డి కేసులో లాబీయింగ్‌కి వాడుకుంటున్నారని వార్తలు వచ్చాయని మండిపడ్డారు. విజయ్‌కుమార్ స్వామి ఎవరి ద్వారా… ఎందుకు…. ఎవరి విమానంలో వచ్చారు అని ప్రశ్నించారు.
2007 నుంచి విజయ్ కుమార్ స్వామి తనకు తెలుసని అన్నారు. ఆయన విజయవాడకు వచ్చారని తెలిసి.. సీఎం జగన్‌ను కలిసి ఆశీస్సులు ఇవ్వమని తానే విజయ్‌కుమార్ స్వామిని అడిగినట్లు తెలిపారు.
సీఎం జగన్‌కు ఆశీస్సులు ఇవ్వడానికి వస్తే లాబీయింగ్ కోసం అని రాస్తున్నారని మండిపడ్డారు. అసలు విజయకుమార్ స్వామిని ఎందుకు తీసుకువచ్చారో తెచ్చిన వాళ్లు చెప్పాలని డిమాండ్ చేశారు. విూరు చేస్తే ఆశీస్సులు కోసం… మేము చేస్తే లాబీయింగ్ కోసమా? అని ప్రశ్నించారు.