క్యాన్సర్ రోగులకు ఉచితంగా కీమో థెరఫీ

తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష
ఎయిమ్స్‌లో నాలుగుళ్ల తరవాత మోడీ శంకుస్థాపన
ఒక్క ఎయిమ్స్‌కే బిజెపి గొప్పలకు పోతోంది
కెసిఆర్ పాలనలో వైద్యరంగం బలోపేతం
జిల్లాల్లో ప్రభుత్వాసుపత్రుల బలోపేతం
చౌటుప్పల్‌లో వంద పడకల ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన
కేంద్రం తీరుపై మండిపడ్డ మంత్రి హరీష్ రావు
యాదాద్రి భువనగిరి,ఏప్రిల్18: తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని మంత్రి హరీశ్ రావు అన్నారు. 2018లో యాదాద్రి జిల్లాకు ఎయిమ్స్‌ను కేటాయిస్తే నాలుగేళ్ల తర్వాత మోదీ వచ్చి శంకుస్థాపన చేశారని మంత్రి హరీశ్ రావు తెలిపారు.
ఒక్క ఎయిమ్స్ కేటాయించినందుకే బీజేపీ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. చేతలు తక్కువ.. ప్రచారం ఎక్కువ అన్నట్లుగా బీజేపీ పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. కేంద్రం ప్రారంభించిన ఎయిమ్స్‌లో ఇప్పటివరకు ఎలాంటి అభివృద్ధి లేదని విమర్శించారు.
చౌటుప్పల్‌లో 100 పడకల ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం మంత్రి హరీశ్ రావు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది 8 వైద్య కళశాలలు ప్రారంభించిందని గుర్తు చేశారు. ఎయిమ్స్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 200 ఎకరాల భూమిని కేటాయించిందని పేర్కొన్నారు.
వైద్య రంగంలో తెలంగాణ అద్భుతాలు సృష్టిస్తోందని మంత్రి హరీశ్ రావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పనితీరును నీతిఆయోగ్ కూడా ప్రశంసించిందని తెలిపారు. ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో నమ్మకం పెరిగిం దన్నారు. ప్లోరైడ్ బాధితులకు ఉచితంగా డయాలసిస్ సేవలు అందిస్తున్నామని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా 102 డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. మిషన్ భగీరథ ద్వారా ప్లోరైడ్‌ను తరిమేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని ప్రశంసించారు. ఈ నెలలోనే న్యూట్రీషియన్ కిట్ పథకాన్ని
ప్రారంభించబోతున్నామని తెలిపారు.
సూర్యాపేట, నల్లగొండలో నర్సింగ్ కాలేజ్, పారా మెడికల్ కాలేజీ మంజూరు చేశామన్నారు. బీఆర్‌ఎస్ పాలనలో వైద్య విద్య బలోపేతమైందని మంత్రి హరీశ్ రావు పునరుద్ఘాటించారు. క్యాన్సర్ రోగుల కోసం కీమోథెరపీ సేవలు ప్రారంభించబోతున్నామని చెప్పారు.
ఎల్బీనగర్‌లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించబోతున్నామని తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఒక్క ఏడాదిలో 10వేల పడకలు అందుబాటులోకి రాబోతున్నాయని తెలిపారు. వరంగల్ హెల్త్ సిటీ పనులు వేగంగా జరుగుతున్నాయని అన్నారు. డిసెంబర్ నాటికి వరంగల్ హెల్త్ సిటీ అందుబాటులోకి వస్తుందని తెలిపారు.
దేశానికే తెలంగాణ మోడల్‌గా ఉందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తోందని.. ఇదే కాంగ్రెస్ పాలనకు బీఆర్‌ఎస్ పాలనకు తేడా అని స్పష్టం చేశారు. చౌటుప్పల్‌లో 100 పడకల ఆస్పత్రి నిర్మాణానికి మంగళవారం వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి శంకుస్థాపన చేశారు.
36 కోట్లతో ఈ ఆస్పత్రిని నిర్మిస్తున్నామని చెప్పారు. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో ఇచ్చిన హావిూ మేరకు చౌటుప్పల్ ఆస్పత్రితో పాటు నియోజకవర్గంలోని 4 పీహెచ్‌సీలను అప్‌గ్రేడ్ చేస్తున్నామని తెలిపారు.చౌటుప్పల్‌లో 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని 100 పడకల ఆస్పత్రిగా మార్చడం ద్వారా సవిూప ప్రాంతాల్లో ప్రజలకు నయాపైసా ఖర్చు లేకుండా అన్ని రకాల వైద్యసేవలు అందనున్నాయి.
ఈ దవాఖానలో ప్రతి నిత్యం సుమారు 300 మందికిపైగా ఓపీ సేవలు పొందుతున్నారు. నెలకు 50 వరకు ప్రసవాలు కూడా జరుగుతున్నాయి. అంతేకాకుండా 65వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారు సైతం ఇక్కడేకు వస్తుంటారు.
ALSO READ: భారత్‌లో యాపిల్ తొలి రిటైల్ స్టోర్
అన్ని రకాల వైద్యసేవలు అందుబాటులో లేక రోగులు ప్రైవేటు దవాఖానలకు వెళ్లి ఆర్థికంగా ఇబ్బందుల పాలవుతున్నారు. వీటి దృష్ట్యా మునుగోడు ఉప ఎన్నిక ప్రచార సమయంలో చండూర్ బహిరంగ సభలో ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి నియోజకవర్గంలో 100 పడకల దవాఖాన కావాలని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన అభ్యర్థన మేరకు వంద పడకలకు హావిూ ఇచ్చారు. ఈ హావిూ మేరకు 100 పడకల ఆస్పత్రిని మంజూరు చేశారు. దవాఖానలో 100 పడకలు వస్తే పేదలకు నయాపైసా ఖర్చుల లేకుండా 24గంటల వైద్య సేవలు అందనున్నాయి.
చౌటుప్పల్‌తో పాటు సంస్థాన్‌నారాయణపురం, వలిగొండ, భూదాన్‌పోచంపల్లి, చిట్యాల, మునుగోడు, చండూరు, మర్రిగూడ, నాంపల్లి తదితర మండలాల ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి రానున్నా యి. ప్రస్తుతం ఇక్కడ 5గురు వైద్యులు సుమా రు 30 మంది సిబ్బంది పనిచేస్తున్నారు.
వంద పడకల దవాఖానగా మారితే అన్ని రకాల శస్త్ర చికిత్సలు చేయనున్నారు. జనరల్ సర్జన్‌తోపాటు ఎముకల, చిన్న పిల్లల, చెవు, ముక్కు, గొంతు, గైనకాలజి, అనస్తీషియా ప్రత్యేక విభాగాల వైద్యులు సేవలు అందుబాటులోకి రానున్నాయి. 20 మంది పైగా వైద్యులు ఇక్కడకు రానున్నారు. 100 మందికి పైగా ఇతర సిబ్బంది కూడా పనిచేయనున్నారు.
ప్రత్యేక బ్లడ్ బ్యాంక్, ఐసీయూ కూడా ఏర్పాటు కానుంది. తద్వారా వివిధ రకాల రోగాలకు శస్త్ర చికిత్స చేయనున్నారు. 65వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాలు ఎక్కువ చోటుచేసుకోవడంతో క్షతగ్రాతులకు ప్రథమ చికిత్స చేసి హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. ఈ క్రమంలో ప్రైవేటు దవాఖానకు వెళ్లి అప్పుల్లో కూరుకుపోతున్నారు.
అంతేకాకుండా గాయపడిన వారి బంధువులు ఇతర ప్రాంతాల్లో ఉండటంతో వారు ఇక్కడ రావడం ఆలస్యం అవుతున్నది. దాంతో ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారికి తక్షణమై ఐసీయూ,శస్త్ర చికిత్సలు అందుబాటులో లేకపోవడంతో మృత్యువాత పడిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ప్రస్తుతం అలాంటి వాటికి చెక్ పెª`టటె అవకాశాలు ఉన్నాయి.