Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

కర్నాటకలో పెరిగిన ఎన్నికల నిఘా

ఎన్నికల ఖర్చులపై ప్రత్యేక దృష్టి
నీడలా వెన్నాడుతున్న పరిశీలకులు
డబ్బు రవాణాపైనా డేగకన్ను
బెంగళూరు,మార్చి18: కర్నాకటలో మరోమారు అధికారం లక్ష్యంగా బిజెపి ప్రణాళికలు సిద్దం చేస్తోంది. అయితే పార్టీలో సీనియర్లు కొందరు పార్టీని వీడడం దానికి మింగుడుపడడం లేదు. మరోవైపు ఎన్నికల సంఘంకూడా పటిష్ట ఏర్పాట్లతో ముందుకు సాగుతోంది. గతంకన్నా భిన్నంగా ఇప్పుడు జిల్లాల్లో అధికారులు నిఘా కట్టుదిట్టం చేశారు.

ప్రధానంగా ఎన్నికల ఖర్చుపై ప్రత్యేక దృష్టి సారించారు. నగదు ప్రవాహంపై ఆరా తీస్తున్నారు. అభ్యర్థుల ప్రచారం, నగదు వ్యవహారాలపై ఎన్నికల ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. ఎప్పటికప్పుడు జిల్లాలకు, అక్కడి నుంచి రాష్టాన్రికి నివేదికలు వెళుతున్నాయి. ఎన్నికల కమిషన్‌ నిబంధనల మేరకు పోటీ చేస్తున్న అభ్యర్థి రూ.70లక్షలకు మించి ఖర్చు చేయడానికి వీలు లేదు. ఈ నేపథ్యంలో నిత్యం నిఘా ఏర్పాటు చేస్తున్నారు.

ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి ఖర్చు వివరాలపై ఈసారి ఎన్నికల కమిషన్‌ ప్రత్యేక దృష్టి సారించింది. డబ్బు చేరవేతపై గట్టి నిఘా పెట్టామని ఎన్నికల అధికారి మనోజ్‌ కుమార్‌ విూనా చెప్పారు. రషీదులు, రుజువులు దగ్గర పెట్టుకోవాలని సూచించారు. విధించిన పరిమితికి మించి ఖర్చు పెడితే చర్యలు తీసుకునేందుకు ఏర్పాటు చేస్తున్నారు.

ALSO READ: కరెంట్‌ లేదు..రాదు అన్న ఆలోచన లేకుండా…

మరోవైపు అభ్యర్థుల లెక్కలు తప్పుగా చూపే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రత్యేక బృందాల ద్వారా ర్యాలీలు, బహిరంగ సభలతోపాటు ఇతర కార్యక్రమాలను వీడియో ద్వారా చిత్రీకరించనున్నారు. ర్యాలీలు, సభల్లో ఎమ్మెల్యే
ఫొటోలు వాడితే ఆ సభకు అయ్యే ఖర్చును అభ్యర్థి ఖాతాలోనే లెక్కిస్తారు. ప్రచారానికి సంబంధించిన వివరాలను నమోదు చేసేందుకు ఎన్నికల అధికారులు ఎంపి అభ్యర్థులకు ప్రత్యేక రిజిష్టర్‌ను అందజేస్తు న్నారు. ఈ రిజిష్టర్‌లో అభ్యర్థులు తమ ఎన్నికల ఖర్చు వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.

సామాన్య పౌరులు తమతో రూ.50 వేలకు మించి నగదు తీసుకెళ్లవద్దని, అంతకు మించి తరలిస్తే వాటిని సీజ్‌ చేసి ఆ దాయపు పన్నుల శాఖకు అప్పగించనున్నారు. నగదుకు సంబంధించిన రశీదు, ధ్రువ పత్రాలను చూపించాల్సి ఉంటుంది. కాగా జీరో అకౌంట్స్‌ ఖాతాలతోపాటు, బ్యాంకుల లావాదేవీలపై కూడా అధికారులు కన్నేశారు.

అనుమానిత వ్యక్తులపై కూడా నిఘా ఉంచేందుకు ప్రజలతో భాగ్యస్వామ్యం అవుతున్నారు. సమాచార వ్యవస్థను మరింత పెంచుకుంటున్నారు. ఈసారి నూతనంగా ప్రతీ పోలింగ్‌ స్టేషన్‌ను జియో ట్యాగింగ్‌తో అనుసంధానం చేస్తున్నారు. ప్రస్తుతం అత్యధునిక సాంకేతికతతో కూడిన జియో ట్యాగింగ్‌ సిస్టమ్‌ను పోలీస్‌ యంత్రాంగం వినియోగిస్తోంది. ఎన్నికల నేపథ్యంలో పోలీసులు జిల్లాలో నిరంతరం నిఘా ఏర్పాటు చేశారు.

ఎన్నికల కార్యకలాపాలపై దృష్టి సారిం చేందుకు ప్రత్యేక నిఘా బృందాలను నియమించారు. ఈ బృందాలు ఎప్పటికప్పుడు జిల్లాలను జల్లెడ పడుతున్నాయి. జిల్లాలో సంఘ వ్యతిరేక శక్తులు ప్రవేశించకుండా సరిహద్దు ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు. జిల్లాల్లోని సరిహద్దు రాష్టాల్ల్రో గట్టి నిఘాను ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు.

ALSO READ: స్వల్పంగా తగ్గిన పత్తి ధర

జిల్లా మహారాష్ట్ర సరిహద్దు, కేరళ, తమిళనాడు, ఆంధ్రా, తెలంగాణను ఆనుకుని ఉన్నందున అన్ని ప్రాంతాల్లో నిఘా పెంచామన్నారు. పరీవాహక ప్రాంతం వెంట కూంబింగ్‌ ముమ్మరం చేశామని, సంఘ వ్యతిరేక శక్తులు జిల్లాలో ప్రవేశించకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామన్నారు.

ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీసు సిబ్బందిని అప్రమత్తం చేయడంతో పాటు సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించి ఎన్నికలు శాంతియుతంగా జరిగేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. ఎన్నికల్లో మద్యం, నగదు పంపిణీని అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నారు. గ్రామాల్లో నాటుసార కేంద్రాలు, బెల్టు దుకాణాలను అరికట్టడంతో పాటు విక్రయాలు జరిపే వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు.

ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందున ఇతరులను కించపరిచేలా మాట్లాడటం, సోషల్‌ విూడియాలో అభ్యంతకర పోస్టులు పెట్టినా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. గ్రామాల్లో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతీ ఒక్కరు సహకరించాలని కోరారు. గ్రామాల్లో అపరిచిత వ్యక్తులు సంచరిస్తే సమాచారం ఇవ్వాలని సూచించారు.

ఎన్నికల నేపథ్యంలో మద్యం, డబ్బు అక్రమ రవాణాను నివారించేం దుకు నిఘా మరింత పెంచారు. అక్రమంగా మద్యం సరఫరా కాకుండా చర్యలు తీసుకుంటు న్నారు. అలాగే మద్యం తరలిం పుపైనా ఎక్సైజ్‌ అధికారులు నిఘా పెట్టారు.

ఎన్ని కలకు ముందు ఏరులై పారే మద్యం అమ్మకాలు, సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాయి. ఇతర ప్రాంతల నుంచి అక్రమంగా మద్యం తరలి పోకుండా ప్రత్యేక తనిఖీలపై సైతం చేపడుతున్నారు.