Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఎండాకాలంలో పొగమంచు …దుప్పటి

 

తూర్పుగోదావరి జిల్లా..

ఏప్రిల్ 17.. నిజం న్యూస్..

ఎండాకాలం రావడంతో

ఒక వైపు ఎండలు దంచికొడుతుంటే సోమవారం ఉదయం తూర్పుగోదావరి జిల్లాలో పలుప్రాంతాల్లో పొగమంచుఏర్పడింది.

ఎండాకాలంలో ఈ పొగ మంచు ఏంటి? అని పలువురు ఆసక్తిగా చర్చించుకున్నారు.

ఈ విషయమై అనపర్తి ఎం.ఎన్.ఆర్ విద్యాసంస్థలలో సైన్స్ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న

సి.హెచ్ శివ అమ్మిరాజును సంప్రదించగా వాతావరణంలో గల నీటి ఆవిరి వాయు రూపం నుండి ద్రవ రూపంలోకి మారడాన్ని సాంద్రీకరణగా పిలుస్తారని,వాతావరణం పరిస్థితుల యందు మార్పు వలన జరిగే ఈ సాంద్రీకరణ అనే ప్రక్రియ వలన ఈ విధంగా పొగమంచు గాని,మంచు గాని సాధారణంగా

ALSO READ: భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

శీతాకాలంలో ఉదయం సమయంలో ఏర్పడుతుందని,అలాగే ఒక్కొక్కసారి వేసవికాలం కూడా ఇలా సంభవించవచ్చని పేర్కొన్నారు.

అయితే మొత్తానికి పొగమంచు ప్రభావం వలన తూర్పుగోదావరి జిల్లాలో ఉదయం పూట ప్రకృతి చూపరులను ఆకట్టుకుంది..