Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

షర్మిల పార్టీలో చేరి నా గొంతు నేను కోసుకొలేను….

ఎల్ బి నగర్,ఏప్రిల్ 17,నిజం న్యూస్.గత కొద్ది రోజులుగా తీవ్ర ఉత్కంఠ రేపుతున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యవహారానికి కొద్ది రోజుల్లో శుభం కార్డ్ పడే అవకాశం ఉంది.

బి ఆర్ ఎస్ పై కొన్ని నెలలుగా అసంతృప్తి తో ఉన్న పొంగులేటి నీ కొద్ది రోజుల క్రితం బి ఆర్ ఎస్ పార్టీ సస్పెండ్ చేసింది.బి ఆర్ ఎస్ నుండి దూరమైన ప్పటి నుండి బి జే పీ ,కాంగ్రెస్ ,షర్మిల లు తమ,తమ పార్టీ ల్లోకి రావాలని ఆహ్వానించారు.

పొంగులేటి వై ఎస్ ఆర్ అభిమాని కావడం మరియు ఆ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు కావడం మరియు రాజకీయ ప్రవేశం జరిగింది వై ఎస్ ఆర్ సి పీ నుండి కావడం తో అందరు షర్మిల పార్టీ లోకి పొంగులేటి వస్తాడు,పార్టీ బలపడుతుందని పొంగులేటి మరియు షర్మిల అభిమానులు భావించారు.

కానీ గత రెండు రోజులుగా వివిధ మీడియా ఛానెల్స్ లో షర్మిల పార్టీ లోకి వెళ్ళేది లేదని స్పష్టం చేశారు.మొహమాటానికి షర్మిల పార్టీ లో చేరి నా గొంతు నేను కోసుకొలేనని ఖరాఖండిగా చెప్పడం తో ఇక షర్మిల పార్టీ లోకి రాడ ని తేలిపోయింది.

ALSO READ: మహారాష్ట్ర ధాన్యం రాకుండా…

ఈ రోజు రాహుల్ టీమ్ పొంగులేటి తో సుదీర్ఘ చర్చలు జరిపినట్లు ,పొంగులేటి అడిగిన అన్ని సీట్లు ఇవ్వడా నికి ఒప్పుకున్నట్టుగా తెలిసింది. తెలంగాణ ఇచ్చిన పార్టీ గా కాంగ్రెస్ కు గుర్తింపు ఉంది.పొంగులేటి చేరిక తో ఇంకా బలం పుంజుకుంటుంది.

హైదరాబాద్ లోని కంటోన్మెంట్ అసెంబ్లీ సీట్ కూడా తాను చెప్పిన వారికే ఇవ్వాలనే కండీషన్ పొంగులేటి పెట్టినట్లు తెలిసింది.హైదరాబాద్ లో ఇతర పార్టీ లో ఉన్న కార్యకర్థలు కూడా పొంగులేటి వెంట కాంగ్రెస్ లోకి వెళ్ళడానికి సిద్దం అవుతున్నట్లు తెలిసింది.ఎల్ బి నగర్,ఇబ్రహీం పట్నం తదితర నియోజక వర్గాల్లో నీ షర్మిల పార్టీ కార్యకర్తలు కూడా పొంగులేటి వెంట వెళ్లడానికి సిద్దం అవుతున్నారు అని తెలిసింది.

షర్మిల,పొంగులేటి ఇద్దరు రాజకీయం గా కలుస్తారని భావించిన వారి అభిమానులకు నిరాశే మిగిలింది.షర్మిల పార్టీ లో ఉన్న క్యాడెర్ అంత పేరుకే పదవులు తీసుకుని అన్ని రకాలుగా లబ్ధి పొంధుతున్నారు కానీ పార్టీ అభివృద్ధి కి కృషి చేయడం లేదని బాహాటంగా నే విమర్శిస్తున్నారు.

నియోజక వర్గం మీద ఏ మాత్రం పట్టు లేని వాళ్ళను కో ఆర్డినేటర్ లు గా నియమించారని అంటున్నారు.నిజంగా పార్టీ కోసం కష్ట పడే వాళ్లకు పార్టీ లో గుర్తింపు లేదని పలువురు సోషల్ మీడియా కార్యకర్తలు అవేదన వ్యక్తం చేస్తున్నారు.పార్టీ పెట్టిన అప్పటి నుండి షర్మిల ఎన్నో వ్యయ ప్రయాసలకు,ప్రత్యర్థుల నుండి అవమానాలకు గురి అయ్యిందని పలువురు అవేదన వ్యక్తం చేస్తున్నారు.

జిల్లా అధ్యక్షులు, కో ఆర్డినేటర్ లు ఉత్సవ విగ్రహాలు గా మిగిలి పోతున్నరాని సీనియర్ కార్యక్కర్త లు విమర్శిస్తున్నారు.జిల్లా,నియోజక వర్గ స్థాయి నాయకుల వ్యవహార శైలి వల్లనే చాలా మంది పార్టీ కి దూరం అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.పొంగులేటి కాంగ్రెస్ లో చేరితే షర్మిల పార్టీ కార్యకర్తలు చాలా మంది పొంగులేటి వెంట వెళ్ళే అవకాశం ఉంది.