Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

24 గంటల్లో 27 మంది మృత్యువాత

60వేలు దాటిన కరోనా కేసులు
న్యూఢల్లీి,ఏప్రిల్‌17(ఆర్‌ఎన్‌ఎ): దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. గడచిన
24 గంటల్లో 9,111 కొత్త కొవిడ్‌ కేసులు వెలుగుచూడటంతో దేశంలో ప్రస్థుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 60వేల మార్కు దాటింది.

దేశంలో సోమవారం నాటి యాక్టివ్‌ కేసుల సంఖ్య 60,313కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. రోజువారీ కొవిడ్‌ పాజిటివిటీ రేటు 8.40 శాతంగా రికార్డు అయింది. దేశంలో ప్రబలిన కరోనా కేసుల సంఖ్యలో 0.13 శాతం యాక్టివ్‌ కొవిడ్‌ వైరస్‌ కేసులున్నాయి.

ALSO READ: ఉత్తరప్రదేశ్‌ 183 ఎన్‌కౌంటర్లు….సుప్రీంకోర్టులో తాజాగా పిటిషన్‌

దేశంలో గడచిన 24 గంటల్లో కరోనాతో 27 మంది మరణించారు. గుజరాత్‌ రాష్ట్రంలో ఆరుగురు, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో నలుగురు, రాజస్థాన్‌, ఢల్లీిలలో ముగ్గురు చొప్పున, మహారాష్ట్రలో ఇద్దరు, తమిళనాడు, కేరళ, చత్తీస్‌ ఘడ్‌, జార్ఖండ్‌, బీహార్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్టాల్ల్రో ఒక్కొక్కరు చొప్పున కరోనా మరణాలు నమోదయ్యాయి.

దేశంలో కరోనా వైరస్‌ వల్ల మొత్తం మరణాల సంఖ్య 5,31,141 కి పెరిగింది. గత 24 గంటల్లో 6,313 మంది కొవిడ్‌ బారి నుంచి కోలుకున్నారు. కరోనా సోకినా 98.68 శాతం మంది కోలుకుంటున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. కరోనా వల్ల మరణాల శాతం 1.18 శాతం అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడిరచింది.