23న హైదరాబాద్‌కు అమిత్ షా

తెలంగాణలో ఇక దూకుడు
జూపల్లి, పొంగులేటిలపై వల
హైదరాబాద్,ఏప్రిల్17:తెలంగాణలో బీజేపీ స్పీడ్ పెంచింది. కేంద్రమంత్రి అమిత్ షా ఏప్రిల్ 23న హైదరాబాద్ కు రానున్నారు. ఈ క్రమంలో చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో భారీ బహిరంగ సభకు రాష్ట్ర నాయకత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది.
ఈ సభలో అమిత్ షా కీలకమైన ప్రకటనలు చేస్తారని తెలుస్తోంది. అంతేకాకుండా భారీ స్థాయిలో చేరికలు ఉంటాయని పార్టీ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది. బీఆర్‌ఎస్ నుంచి ఇటీవల సస్పెండ్ అయిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారెడ్డి బీజేపీలో చేరనున్నారన్న ప్రచారం అయితే నడుస్తోంది.
కర్ణాటక ఎన్నికల తరువాత అమిత్ షా తెలంగాణపై పూర్తిగా ఫోకస్ పెడతారని బీజేపీ నేతలు చెబుతున్నారు. కొద్దిరోజుల క్రితం ప్రధాని మోడీ హైదరాబాద్ కు వచ్చిన సంగతి తెలిసిందే. తెలంగాణలో పరిస్థితి బీజేపీకి అనుకూలంగా ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అభిప్రాయపడ్డారు.
ALSO READ: రక్తం గడ్డకట్టక పోవడం కూడా ఓ వ్యాధే
2024లో జరగనున్న పార్లమెంటు ఎన్నికల కోసం ఆయన అప్పుడే ప్రచారాన్ని దక్షిణ గోవాలో ప్రారంభించారు. ఆదివారం జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ తెలంగాణ ప్రజల మనోభావాలను ప్రస్తావించడం ప్రాధాన్యతను సంతరించుకొంది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజల మూడ్ బీజేపీవైపు ఉండడాన్ని నేను గమనిస్తున్నానని అన్నారు. ఒడిశాలోనూ పరిస్థితి ఇదే విధంగా ఉందని చెప్పారు. వచ్చే నెలలో కర్ణాటకలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు.
బీజేపీ గోవా, ఉత్తరాఖండ్ వంటి చిన్న రాష్టాల్ల్రో మాత్రమే విజయం సాధిస్తోందంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. అలాంటి వ్యాఖ్యలు చేసి చిన్న రాష్టాల్రను అవమానపరచవద్దని అన్నారు.
రాహుల్ ప్రచారం చేసినప్పటికీ ఈశాన్య రాష్ట్రల్లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయిందని గుర్తు చేశారు. ఆ రాష్టాల్ల్రో ఉన్న మైనార్టీ ఓట్ల ఆధారంగా వాటిని కంచుకోటలని కాంగ్రెస్ భావిస్తూ వచ్చిందని, కానీ అక్కడి ప్రజలు భద్రత, శాంతి, అభివృద్ధిని కోరుకుంటున్నారని చెప్పారు.