Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

రక్తం గడ్డకట్టక పోవడం కూడా ఓ వ్యాధే

ఏప్రిల్‌ 17న ప్రపంచ హిమోఫిలియా దినోత్సవం
దానిపై అవగాహన..చికిత్స కూడా అసవరమే
న్యూఢల్లీి,ఏప్రిల్‌17(ఆర్‌ఎన్‌ఎ):ఏటా ఏప్రిల్‌ 17న ప్రపంచ హిమోఫిలియా దినోత్సవ జరుపుకుంటారు. .హిమోఫిలియా వ్యాధి మరియు ఇతర రక్తస్రావ లోపాల గురించి ప్రజల్లో అవగాహన పెంచడం ప్రపంచ హిమోఫిలియా దినోత్సవం.

ముఖ్య ఉద్దేశ్యం… ఏప్రిల్‌ 17 నే ఎందుకు వరల్డ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ హిమోఫిలియా ను స్థాపించిన ఫ్రాంక్‌ ష్నాబెల్‌ ఏప్రిల్‌ 17 న జన్మించాడు.ఈయన జ్ఞాపకార్థం ఈయన పుట్టినరోజైన ఏప్రిల్‌ 17 ను ప్రపంచ హిమోఫిలియా దినోత్సవంగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తుంది.

హిమోఫిలియా అంటే.. మనిషికి గాయం అయినప్పుడు రక్తం కారుతుంది. అయితే, కొంతసేపటి తరువాత రక్తం గడ్డకట్టుతుంది. రక్తం గడ్డకట్టకుండా, రక్తం కారడాన్ని హిమోఫిలియా అంటారు.

హిమోఫిలియాను ప్రధానంగా రెండు రకాలుగా విభజించుకోవచ్చు. హిమోఫిలియా ఎ రకంలో ఫ్యాక్టర్‌ 8 లోపం, బి రకంలో ఫ్యాక్టర్‌ 9 లోపం కనబడుతుంది. దాదాపు 90శాతం మందిలో ఎ రకమే కనబడుతుంది.

ALSO READ: రామప్పలో ఈనెల 18న ప్రపంచ వారసత్వ ఉత్సవాలు

మరో 9 శాతం మందిలో బి రకం, మిగతా ఒక శాతం మందిలో ఫ్యాక్టర్‌ 11, 5 లోపం వంటి ఇతరత్రా రకాల హిమోఫిలియా కనబడుతుంది. 70 శాతం వంశపారంపర్యంగానూ, 30 శాతం ఆకస్మిక జన్యు మార్పిడి కారణంగా, పుట్టుకతో వచ్చే ఈ వ్యాధి వలన వ్యాధిగ్రస్తులు ఏటా పెరుగుతున్నారని సర్వేలు చెబుతున్నాయి.

ఎక్కువ శాతం మగపిల్లలోనే ఈ వ్యాధి ఉంటుంది. ప్రతి పదివేల మందిలో ఒకరికి ఈ వ్యాధి ఉంటుంది. వ్యాధిని గుర్తించడం ఎలా.. రక్తం గడ్డకట్టకపోవడం ఈ వ్యాధి ప్రధాన లక్షణం.శరీరంలో గాయాలు అయినప్పుడు, ఏదైనా శస్త్ర చికిత్స జరిగినప్పుడు, ప్రమాదాలు జరిగినపుడు రక్తం గడ్డకట్టకుండా నిరంతరంగా రక్తం స్రవించడం, గాయాలు మానకపోవడం, ముక్కు నుండి రక్తం కారడం, చిగుళ్లు, మల, మూత్రం ద్వారా రక్తం స్రవించడం. సమస్య తీవ్రంగా ఉన్నవారిలో ఇంజెక్షన్‌ తీసుకున్న చోట పెద్దగా ఉబ్బటం, అక్కడక్కడా చర్మం నల్లగా కమిలినట్టు కనిపించటం వంటివీ వేధిస్తుంటాయి.

కొందరికి ఎలాంటి కారణం లేకుండానే ఉన్నట్టుండి ఒంట్లోనూ రక్తస్రావం కావొచ్చు. ఇలా కండరాల్లోకి, కీళ్లలోకి రక్తస్రావం కావటం వల్ల తీవ్రమైన నొప్పి, వాపుతో పిల్లలు విలవిల్లాడిపోతారు. తరచుగా రక్తస్రావమైతే కీళ్లు పెద్దగా ఉబ్బి, ఆకారం మారిపోవచ్చు.

ఈ అవకరం శాశ్వతంగానూ ఉండిపోతుంది. కాబట్టి దీనిపై అవగాహన కలిగి ఉండటం అవసరం. గాయం నుంచి స్రవిస్తున్న రక్తం ఎంతకీ గడ్డకట్టకపోతే, ఐసు గడ్డను గాయంపై పూసి, తక్షణమే వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది.