Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

కాంగ్రెస్‌లో చేరిన బీజేపీ మాజీ సిఎం జగదీశ్‌ షెట్టార్‌

ఖర్గే తదితరుల సమక్షంలో పార్టీలో చేరిక
హస్తసాముద్రికం మారుతుందన్న కాంగ్రెస్‌ నేతలు
బెంగళూరు,ఏప్రిల్‌17: కర్ణాటక మాజీ సీఎం జగదీశ్‌ శెట్టర్‌ కాంగ్రెస్‌లో చేరారు. ఇప్పటికే ఎమ్మెల్యే పదవి, బీజేపీకి రాజీనామా చేసిన ఆయన.. సోమవారం కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు.

బెంగళూరులోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌, కాంగ్రెస్‌ నేతలు రణదీప్‌ సూర్జేవాలా, సిద్ధరామయ్య సమక్షంలో ఆయన కాంగ్రెస్‌ లో చేరారు. హుబ్బళ్లి`ధార్వాడ్‌ సెంట్రల్‌ నియోజకవర్గం నుంచి జగదీశ్‌కు కాంగ్రెస్‌ తరుపున టిక్కెట్‌ దక్కే అవకాశం ఉంది.

ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జగదీష్‌.. గతంలో కర్ణాటక సీఎంగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. సీనియర్‌ నాయకుడనైన తనకు బీజేపీ నుంచి టిక్కెట్‌ వస్తుందని అనుకున్నాననని జగదీశ్‌ శెట్టర్‌ అన్నారు. కానీ నాకు అది రాలేదని తెలియగానే షాక్‌కు గురయ్యానని తెలిపారు.

ఎవరూ తనతో మాట్లాడలేదని.. కనీసం ఒప్పించే ప్రయత్నం చేయలేదని చెప్పారు. తనకు బీజేపీ ఎలాంటి హావిూ ఇవ్వలేదని జగదీశ్‌ శెట్టర్‌ అన్నారు. అటు జగదీష్‌ కు పెద్ద పదవిని ఇస్తామని బీజేపీచీఫ్‌ జేపీ నడ్డా కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా హావిూ ఇచ్చారని కర్ణాటక సీఎం బసవరాజ్‌ బొమ్మై వెల్లడిరచారు.

కర్ణాటకలో మే 10న ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. 13న ఫలితాలు వెల్లడిరచనున్నారు. 224మంది సభ్యులున్న
కర్ణాటక అసెంబ్లీలో బీజేపీకి 119మంది, కాంగ్రెస్‌కు 75 మంది, జేడీఎస్‌కు 28మంది సభ్యులుండగా 2సీట్లు ఖాళీగా ఉన్నాయి.

ALSO READ: విశాఖ ఉక్కు కొనుగోలు నాటకానికి తెరతీసిన కెసిఆర్‌..?

కర్ణాటక రాష్ట్రంలో ప్రముఖ లింగాయత్‌ నాయకుడుగా మాజీ ముఖ్యమంత్రి జగదీష్‌ షెట్టార్‌ పేరుగడిరచారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రముఖ నేత అయిన జగదీష్‌ షెట్టార్‌ బీజేపీని వీడి కాంగ్రెస్‌ పార్టీలో చేరడం సంచలనం రేపింది.

బీజేపీని కిందిస్థాయి నుంచి పటిష్ఠం చేసిన తాను ఆ పార్టీని వదిలి కాంగ్రెస్‌ లో చేరానని షెట్టార్‌ చెప్పారు. తాను ఆరుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించానని, ఏడోసారి కూడా తాను ఎన్నికల బరిలోకి దిగుతానని జగదీష్‌ షెట్టార్‌ ప్రకటించారు. సీనియర్‌ నాయకుడైన తనకు ఈ సారి బీజేపీ టికెట్‌ ఇవ్వకపోవడంపై తాను దిగ్భార్రతి చెందానని, తనను బీజేపీ నేతలు ఎవరూ కలవలేదని షెట్టార్‌ చెప్పారు.

ఏప్రిల్‌ 11వతేదీన బీజేపీ ఇన్‌ చార్జ్‌ తనకు ఫోన్‌ చేసి పిల్లాడిలా తనతో మాట్లాడారని షెట్టార్‌ ఆరోపించారు. దీంతో తాను డీకే శివకుమార్‌, సిద్ధరామయ్య, సూర్జేవాలా, ఎంబీపాటిల్‌ ను సంప్రదించానని వారు తనను ఆహ్వానించడంతో మనస్ఫూర్తిగానే కాంగ్రెస్‌ పార్టీలో చేరానని జగదీష్‌ చెప్పారు.

జగదీష్‌ చేరికతో కాంగ్రెస్‌ పార్టీలో కొత్త ఉత్తేజం వచ్చిందని, వివాదాలకు దూరంగా ఉండే షెట్టార్‌ వల్ల కాంగ్రెస్‌ పార్టీకి మరిన్ని స్థానాలు గెల్చుకుంటుందని కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున్‌ ఖర్గే వ్యాఖ్యానించారు.

షెట్టార్‌ చేరికతో కాంగ్రెస్‌ పార్టీకి కొత్త చరిత్ర పునరావృతం అవుతుందని, తమ పార్టీకి 150 సీట్లు లభిస్తాయని కాంగ్రెస్‌ ఎంపీ రణదీప్‌ సింగ్‌ సూర్జే వాలా ట్వీట్‌ చేశారు.