Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతుల సద్వినియోగం చేసుకోవాలి

సూర్యాపేట జడ్పీ చైర్ పర్సన్ దీపిక యుగంధర్ రావు ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్.

తుంగతుర్తి ఏప్రిల్ 18 నిజం న్యూస్

ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకుని అభివృద్ధిలోకి రావాలని సూర్యనపేట జడ్పీ చైర్ పర్సన్ దీపిక యుగంధర్ రావు ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ అన్నారు సోమవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో కల్యాణ లక్ష్మి 40 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేసి అనంతరం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభి మాట్లాడారు

Also Read: ఉత్తరాఖండ్‌లో ధౌలిగంగా నదిపై విరిగిన వంతెన …

 

ముఖ్యమంత్రి కేసీఆర్ పేద ప్రజల ప్రయోజనాల దృష్టియా కళ్యాణ్ పేదింటి ఆడబిడ్డల కోసం కల్యాణ లక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టి ఒక లక్ష 116 ల సుమారు 40 చెక్కులను పంపిణీ చేశారు. రైతుల ప్రయోజనాల దుష్ట కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జిల్లాలను రప్పించి గ్రామాల్లోని చెరువులను కుంటలను నింపి నేడు రైతాంగాన్ని పూర్తిస్థాయిలో ఆదుకుంటున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కి దక్కిందని అన్నారు

అవకాశం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అండదండగా ఉండాలని కోరారు. రానున్న రోజుల్లో పూర్తిస్థాయిలో దళితులకు దళిత బంద్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తులు పండించిన పంటను నేరుగా కొనుగోలు కేంద్రాలు తీసుకొని వచ్చి తేమ లేకుండా చూసుకొని గిట్టుబాటు ధర పొందాలని కోరారు. ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా పంపిణీ చేశారు

ఈ కార్యక్రమంలో, ఎంపీపీ గుండగాని కవిత రాములు గౌడ్, ఉమ్మడి నల్లగొండ జిల్లా డిసిసిబి డిసిఎం డైరెక్టర్ గుడిపాటి సైదులు, వైస్ ఎంపీపీ మట్టపల్లి శ్రీశైలం యాదవ్, స్థానిక ఎంపిటిసి చెరుకు సృజనా పరమేష్, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు నల్లు రామచంద్రారెడ్డి,తహసిల్దార్ రాంప్రసాద్, ఎంపీడీవో భీమ్ సింగ్ నాయక్, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పులుసు యాదగిరి గౌడ్, ఏపీఎం నరసయ్య గౌడ్, సీసీలు కొమ్ము యుద్దయ్య , నర్మద, గడ్డం గిరి, వివిధ గ్రామాల సర్పంచులు,ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, కళ్యాణ్ లక్ష్మి లబ్ధిదారులు, ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు…