కాంగ్రెస్ లోకి పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి…?
మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డికి షాక్…!
ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో ఏప్రిల్ 17
(నిజం న్యూస్)
నిర్మల్ జిల్లాలో బిఆర్ఎస్ పార్టీకి మరోసారి భారీ షాక్ తాకనుందా.. అవునని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మొన్న కూచాడి శ్రీహరి రావు అసమ్మతి గల్లమెత్తి మంత్రికి వ్యతిరేకంగా బహిరంగ లేక విడుదల చేసి టిఆర్ఎస్ పార్టీలో సునామి తీసుకొచ్చిన నెల రోజులలోనే మరోసారి ఏకంగా మంత్రిని కాదని కొన్ని రోజుల నుండి టిఆర్ఎస్ పార్టీకి అంటి ముట్టనట్లు ఉంటూ అసమ్మతి శ్రీహరి రావు తో కలిసి మంత్రికి వ్యతిరేకంగా ఓ గ్రూపు తయారు చేసిన విషయం తెలిసిందే.
మంత్రి అల్లోల వ్యక్తిగత వ్యవహారం నచ్చకపోవడం ప్రతి మండలంలో వారి కుటుంబ సభ్యులను ఇన్చార్జిలు గా నియమించడంతో గ్రూప్ రాజకీయాలు చేస్తూ , పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి వ్యతిరేక గ్రూపు రాజకీయాలను ఏర్పాటు చేస్తున్నారని కొన్ని రోజుల నుండి మంత్రికి వ్యతిరేకంగానే ఉంటూ వస్తున్నారు.
ALSO READ: ఉత్తరాఖండ్‌లో ధౌలిగంగా నదిపై విరిగిన వంతెన …
కాంగ్రెస్ పార్టీని వీడి బిజెపి పార్టీలో చేరిన ఏలేటి మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చిన నేపథ్యంలో ఇదే సామాజిక వర్గానికి చెందిన పత్తి రెడ్డి రాజేశ్వర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావాలని పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి, కోక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మంతనాలు జరిపినట్లు తెలుస్తుంది.
ఈ నేపథ్యంలో టిఆర్ఎస్ పార్టీ కి కూడా షాక్ ఇవ్వనున్నట్లు సమాచారం.సారంగపూర్ మండల జడ్పిటిసి పత్తి రెడ్డి రాజేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పలుమార్లు సంప్రదింపులు జరిపినట్లు,నిర్మల్ జిల్లా ఇన్చార్జిగా నియమిస్తున్నట్లు నిర్మల్ ఎమ్మెల్యే టికెట్ కూడా ఖరారు చేస్తామని హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. పత్తి రెడ్డి రాజేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరితే టిఆర్ఎస్ పార్టీకి పెద్ద మైనస్ కానుంది.
నిర్మల్ నియోజవర్గంలో అతిపెద్ద మండల అయిన సారంగాపూర్ లో పత్తి రెడ్డి రాజేశ్వర్ రెడ్డికి పట్టు బాగానే ఉంది. దిలావర్పూర్, నిర్మల్ లక్ష్మణ్ చందా మండలంలో భారీగానే ఓట్లు చీల్చే అవకాశం ఉంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నుండి పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి ఈ ఎన్నికల్లో పోటీ చేసినట్లయితే కింగ్ మేకర్ గా పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి నిలుస్తాడని పలువురు భావిస్తున్నారు.
ఇటు మహేశ్వర్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డికి సారంగాపూర్ మండలాలపై పెట్టుకున్న ఆశలపై పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి పెద్ద గండి కొట్టనున్నారు. ఇప్పటికే నిర్మల్ లో రసవత్తర రాజకీయాలు కొనసాగుతున్న వేళ ఇప్పుడు ఎవరు ఎటు వెళ్ళిపోతున్నారనే భయంతో టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారట.
నిర్మల్ నియోజకవర్గంలో రానున్న ఎన్నికలలో త్రిముఖ పోరు జరగనుంది.జిల్లా కేంద్రంలో దాదాపు మైనార్టీ ఓట్లు 40 వేల వరకు ఉన్నాయి. గతంలో మైనార్టీ ఓట్లను చూసి ఏలేటి మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడే పరిస్థితి లేకపోలేదు. కానీ కాంగ్రెస్ పార్టీలో పోమ్మన లేక పొగ పెట్టినట్టు ఇటు రేవంత్ రెడ్డి అటు ప్రేమ్ సాగర్ రావు, అధిష్టానం కూడా సరైన మద్దతు ఇవ్వకపోవడంతో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్న ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆఖరికి కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకొని బిజెపి పార్టీలో చేరిన విషయం తెలిసిందే.
మహేశ్వర్ రెడ్డికి ఇప్పటికి కూడా గెలుపు పై నమ్మకం లేదని చెప్పుకోవచ్చు. నిర్మల్ నియోజవర్గంలో టిఆర్ఎస్ పార్టీ బలంగా ఉన్నప్పటికీ మూడు వర్గాలు ఏర్పాటు కావడమే ఏలేటి మహేశ్వర్ రెడ్డికి కొంత ప్లస్ కానుంది. పత్తిరెడ్డి, శ్రీహరి రావు టిఆర్ఎస్ పార్టీని వీడినట్లయితే గెలుపు నల్లేరుపై నడకని చెప్పుకోవచ్చు.
ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరికపై పూర్తి చర్చలు సఫలమైనట్లు విశ్వనీయసమాచారం. కాంగ్రెస్ పార్టీలో పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి చేరినట్లయితే జిల్లా కేంద్రంలో త్రిముఖ పోరు తప్పదు. మరి ఎవరు గెలిచినా గెలవకపోయినా దాదాపు 30 వేల ఓట్ల వరకు పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి పొందే పరిస్థితి కనిపిస్తుంది.
ఇదే కొనసాగితే ఇటు ఇంద్రకరణ్ రెడ్డికి అటు మహేశ్వర్ రెడ్డి కి పట్టపగలే చుక్కలు చూపించినట్లే.. ఏమి జరుగుతుందో అప్పటివరకు వేచి చూద్దాం..