జపాన్‌లో భూ కంపం..

జపాన్ దేశాన్ని భూకంపం వణికించింది. శనివారం ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలంతా భయంతో పరుగులు తీశారు. దాని తీవ్రత రిక్టర్ స్కేలు మీద 6.0గా నమోదైంది.

ఆ దేశ రాజధాని టోక్యోకు 407కిలో మీటర్ల దూరంలో భూకంప కేంద్రం నమోదైందని తెలుస్తోంది.అయితే, ఈ ప్రమాదం వలన ఎవరికీ ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని జపాన్ ప్రకటించింది.