Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

లోయలో పడ్డ బస్సు…13 మంది మృతి…25 మంది తీవ్రంగా…

మహారాష్ట్రలో లోయలో పడ్డ బస్సు
13 మంది మృతి..25మందికి గాయాలు
ముంబయి,ఏప్రిల్‌15(ఆర్‌ఎన్‌ఎ): మహారాష్ట్రలోని రాయగడ్‌ జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. ఉదయం 4.30 గంటల సమయంలో పూణెలోని పింపుల్‌ గురవ్‌ నుంచి గోరేగావ్‌కు వెళుతున్న బస్సు… రాయ్‌గఢ్‌ జిల్లాలోని ఓల్డ్‌ ముంబయి`పుణె హైవే విూదుగా వెళుతూ అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లి బోల్తాపడిరది.

ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందారు. 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 41 మంది ప్రయాణికులున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయ కార్యక్రమాలు ప్రారంభించారు.

ALSO READ: ప్రధాని ప్రసంగం చేస్తుండగా …బాంబు పేలుడు

పుణె నుంచి ముంబయికు వెళుతున్న ప్రైవేటు బస్సులో ఓ సంగీత బృందం ప్రయాణిస్తోంది. వారంతా ముంబయిలోని గొరెగావ్‌కు చెందినవారు. పుణెకు దగ్గరలోని పింప్రి చింఛ్వాడ్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరిగి వస్తుండగా… తెల్లవారుజామున ఈ ఘోర ప్రమాదం జరిగింది.

ముంబై`పుణె పాత హైవేపై ఉన్న శిన్‌గ్రోబా ఆలయం సవిూపంలో ఉన్న లోయలో బస్సు పడిరది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు క్షతగాత్రులను కాపాడే ప్రయత్నం చేశారు. గోరేగావ్‌లోని ఓ సంస్థకు చెందిన వ్యక్తులు అంతా పుణెకు వెళ్లి తిరుగు ప్రయాణం చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.