Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ప్రధాని ప్రసంగం చేస్తుండగా …బాంబు పేలుడు

జపాన్‌ ప్రధాని ఫుమియో కిషిదాకు తప్పిన ముప్పు
ప్రధాని సభ వద్ద పొగబాంబు విసిరిన యువకుడు
గుర్తించి పట్టుకున్న పోలీసులు
టోక్యో,ఏప్రిల్‌15: జపాన్‌ ప్రధాన మంత్రి ఫుమియో కిషిదాకు తృటిలో పెను ప్రమాదం తప్పింది.
శనివారం వకయామలోని సైకాజకి పోర్ట్‌లో ప్రధాని కిషిదా పర్యటించారు. కాసేపట్లో ఓ కార్యక్రమ వేదికపై ప్రధాని ప్రసంగం చేయాల్సి ఉండగా, వేదికకు సవిూపంలో బాంబు పేలుడు శబ్దం వినిపించింది. దీంతో ఒక్కసారిగా అంతా ఉలిక్కిపడి అక్కడి నుంచి పరుగులుతీశారు. వెంటనే అప్రమత్తమైన అధికార భద్రతా సిబ్బంది ప్రధానిని వెంటనే అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు.

ఈ ఘటనలో ప్రధానికి ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు వెల్లడిరచారు. జపాన్‌ ప్రధాని సభలో శనివారం పెద్ద పేలుడు ఘటన జరిగింది. వాకయామా నగరంలో జపాన్‌ ప్రధాని ఫుమియో కిషిడా ప్రసంగిస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో జపాన్‌ ప్రధానమంత్రి పుమియో కిషిడా ఉపన్యాసం ఆపి హుటాహుటిన తరలించారు.

ALSO READ: చేతినిండా పని… ఎంతో కొంత ఆదాయం ఉంటే అదే…

ప్రధాని పుమియో కిషిడా ప్రసంగం మధ్యలో పొగబాంబుతో దాడి చేశారు. పొగబాంబు ప్రధాని సవిూపంలో వేశారు. దీంతో ప్రధాని పుమియో ప్రసంగాన్ని మధ్యలో ఆపేసి పరుగెత్తాల్సి వచ్చింది. భద్రతా సిబ్బంది ప్రధాని కిషిడాను ఘటనా స్థలం నుంచి క్షేమంగా తీసుకువెళ్లారు. పశ్చిమ జపాన్‌ నగరమైన వాకయామాలో ప్రధాని కిషిడా ఫిషింగ్‌ హార్బరును పరిశీలించిన తర్వాత ప్రసంగిస్తుండగా బాంబు పేలుడు జరిగిందని జపాన్‌ అధికారులు చెప్పారు.

బాంబు పేల్చిన వ్యక్తిని జపాన్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఘటనాస్థలం నుంచి ఓ యువకుడు పారిపోతుండగా భద్రతా సిబ్బంది గుర్తించి వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ విూడియాలో బయటకు వచ్చాయి. ఆ యువకుడే ప్రధాని ఉన్న వేదికపైకి ’స్మోక్‌ బాంబ్‌’ను విసిరినట్లు అధికారులు తెలిపారు.

జపాన్‌ మాజీ ప్రధాని షింజో అబే దారుణ హత్య జరిగిన నెలల వ్యవధిలో ప్రధానిపై ఇలా బాంబు దాడి యత్నం జరగడం కలకలర రేపుతోంది. 2022 జులైలో ఎన్నికల ప్రచారంలో భాగంగా … ఓ కూడలి వద్ద షింజో అబే ప్రసంగిస్తుండగా ఓ దుండగుడు ఆయనపై అత్యంత సవిూపం నుంచి కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే.

ఆ ఘటనలో తీవ్రంగా గాయపడిన అబే.. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఇదిలా ఉండగా.. మరికొద్ది రోజుల్లో జపాన్‌లో జి`7 దేశాల మంత్రుల సమావేశాలు జరగనున్న వేళ.. ప్రధానిపై ఇలా బాంబు దాడి యత్నం జరగడం కలకలం రేపుతోంది.