Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

సౌర విద్యుత్‌ ప్రయోగాలు పెంచితేనే….

విస్తృత ప్రయోగాలకు ప్రోత్సాహం దక్కాలి
ఐఐటి వంటి సంస్థల్లో పరిశోధనలు సాగాలి
న్యూఢల్లీి,ఏప్రిల్‌15(ఆర్‌ఎన్‌ఎ): దేశంలో నేటికీ నిరంతర విద్యుత్‌ అన్నది కలగానే ఉంటోంది. ఉన్న విద్యుత్‌ ప్రజలకు ఖరీదైన వస్తువుగా మారింది. ఈ క్రమంలో సౌర విద్యుత్‌ ఉత్పత్తి, అధ్యయనం జరగాలి. సౌర విద్యుత్‌ను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసే సులువైన  వ్వయస్థలపై పరిశోధనలు సాగాలి.

రెండేళ్ల క్రితం బొగ్గు సంక్షోభం కారణంగా విద్యుత్‌ ఉత్పత్తికి ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీంతో అనేక రాష్టాల్ల్రో తీవ్ర గందరగోళం ఏర్పడిరది. తరవాత పరిస్థితి సాధారణ స్థితికి చేరుకునా…నేటికీ నిరంతర విద్యుత్‌ అన్నది లేదు.

ఎపిలో కూడా విద్యుత్‌ కష్టాలు ముందు నుంచీ ఉన్నాయి. అయితే తెలంగాణ మినహా దేశంలో ఎక్కడా నిరంతర విద్యుత్‌ సరఫరాకు భరోసా ఉన్న పరిస్థితి కానరావడం లేదు. తెలంగాణలో మాత్రమే నిరంతర విద్యుత్‌తో ప్రజల్లో భరోసా ఉంది. కరెంట్‌ కోతలు అన్న పదం లేకుండా విద్యుత్‌ అందుతోంది.

మన నిత్య జీవితంలో అతి ముఖ్యమైన వనరు విద్యుత్‌ అన్నది గుర్తించాలి. ఇది లేకుంటే ఏరంగం కూడా ముందుకు సాగదు. అభివృద్దికి అతిపెద్ద వనరుగా ఉన్న విద్యుత్‌పై భవిష్యత్‌ ప్రణాళికలు అవసరం. విద్యుత్‌ రంగాన్ని కేంద్రం తన ఆధీనంలోకి తీసుకోవాలని చూస్తున్న వేళ ఇలాంటి సంక్షోభానికి కారణాలను కేంద్రం అద్యయనం చేయాలి.

ధర్మల్‌ పవర్‌ స్టేషన్లలో బొగ్గు నిల్వలు నిరంతర సమస్యగా మారింది. తాజాగా ఆదానీ ఆధీనంలో బొగ్గు గనులు ఉన్నాయని, వాటినే కొనుగోలు చేయాలని మోడీ ప్రభుత్వం ఒత్తిడి చేస్తోందని ఇప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తోంది.

గతంలో సంక్షోభం కారణంగా మహారాష్ట్రలోని 13 బొగ్గు ఆధారిత విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలు తాత్కాలికం గా మూతపడిన సంగతి తెలిసిందే. పంజాబ్‌ సహా అనేక రాష్టాల్రు విద్యుత్‌ సరఫరాపై ఆందోళన వ్యక్తం చేసాయి. ఇప్పటికే అనేకమార్లు కేంద్రంబొగ్గు నిల్వలపై సవిూక్ష నిర్వహించింది.

దేశంలో బొగ్గు కొరత లేదని, అన్ని ప్లాంట్లకు బొగ్గు వేగంగా సరఫరా అవుతోందని ప్రకటించినా..మున్ముందు ఈ సమస్య మరింత పెరిగే ప్రమాదం లేకపోలేదు. కోల్‌ ఇండియా నుంచి వేగంగా బొగ్గు ఉత్పత్తి కావడమే కాకుండా వేగంగా సరఫరా కూడా చేస్తున్నా..ఈ నిల్వలు ఎంతకాలమన్నది కేంద్రం ఆలోచన చేయాలి.

ALSO READ: ప్రజలకు భారంగా మారిన బిజెపి పాలన

బొగ్గుగనులు అధికంగా ఉన్న చత్తీస్‌గడ్‌, జార్ఖండ్‌లో కూడా నిరంతర ఉత్పత్తి సాధ్యం కావడం లేదు. మరోవైపు థర్మల్‌ స్టేషన్ల కారణంగా పర్యావరణ సమస్యలు కూడా వస్తున్నాయి. నిజానికి 130 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో సహజవనరులను వినియో గించుకోవాలన్న బలమైన సంకల్పం రావడం లేదు.

అలాగే నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా అయ్యేలా డిమాండ్‌కు తగ్గ విద్యుత్‌ను కూడా ఉత్పత్తి చేసుకోలేక పోతున్నాం. దీనిపై ఇప్పటికే ఆలస్యం అయ్యింది. థర్మల్‌ విద్యుత్‌ ఖర్చుతో కూడుకున్నది కూడా కావడంతో పాటు..వనరుల కొరత ఏర్పడుతోంది. ఈ క్రమంలో తక్షణం సౌర విద్యుత్‌పై దృష్టి సారించాలి. పెద్ద ఎత్తున సౌర విద్యుత్‌ ఉత్పత్తికి గల అవకాశాలను పరిశీలించి.. ఇందుకు ప్రైవేట్‌ సంస్థలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.

దేశంలో బహుముఖ అనుసంధానమే లక్ష్యంగా చేపట్టిన గతిశక్తితో రాబోయే 25 ఏళ్ల భారతావనికి పునాది పడిOదని ప్రధాని మోదీ చెప్పిన వేళ…సౌర విద్యుత్‌ను కూడా ఒక టాస్క్‌గా తీసుకోవాలి. 16 మంత్రిత్వ శాఖల సమన్వయంతో చేపట్టే ఈ కార్యక్రమం ద్వారా రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాల ముఖచిత్రం సమూలంగా మారనుందని ప్రధాన తెలిపారు.

రూ.100 లక్షల కోట్లతో అమలు చేసే ’పీఎం గతిశక్తి.. నేషనల్‌ మాస్టర్‌ప్లాన్‌ ఫర్‌ మల్టీమోడల్‌ కనెక్టివిటీ’ కార్యక్రమానికి ప్రధాని శ్రీకారం చుట్టారు. ఇందులో సౌరవిద్యుత్‌ లాంటి వ్యవస్థలను కూడా తీసుకుంటే మంచిది. పీఎం గతిశక్తి నేషనల్‌ మాస్టర్‌ ప్లాన్‌’ 21వ శతాబ్దిలో భారతదేశానికి నూతన ఉత్తేజాన్ని అందిస్తుందని ప్రధాని మోదీ వివరించారు.

ప్రగతి కోసం పని, ప్రగతి కోసం సంపద, ప్రగతి కోసం ప్రణాళిక, ప్రగతికే ప్రాధాన్యం.. ఇదే ఈనాటి మంత్రమని ఆయన విశ్వసిస్తున్న వేళ ప్రస్తుత విద్యుత్‌ సంక్షోభానికి శాశ్వత పరిష్కారం చూపగలగాలి. బహుళ సమస్యలను పరిష్కరించడంతోపాటు కీలక మౌలిక వసతుల ప్రాజెక్టుల భాగస్వాముల కోసం ’గతిశక్తి’ని తీసుకొచ్చామని ప్రకటించారు.

ALSO READ: ఓ మంచి ప్రేమ కావ్యాన్ని చెడగొట్టాడు

దీనిద్వారా వివిధ శాఖలు, విభాగాలు ఇతర రంగాలతో సంప్రదింపుల ద్వారా తమ ప్రాజెక్టుల ప్రాధాన్యాన్ని నిర్ణయించు కోగల అవకాశం లభిస్తుంది. వివిధ మంత్రిత్వ శాఖలు తమ ప్రాజెక్టు ప్రణాళికలను రూపొందించుకోవడంలో జాతీయ బృహత్‌ ప్రణాళిక తోడ్పాటునిస్తుందన్నారు.

200కిపైగా అంచెలు గల విశ్లేషణాత్మక అంతరిక్ష ఉపకరణాల ఆధారిత గణాంకాలన్నింటినీ ఈ ప్రణాళిక అందుబాటులోకి తెస్తున్న వేళ విద్యుత్‌ ఉత్పత్తికి.. నిరంతర విద్యుత్‌కు గల అన్ని అవకాశాలను చర్చించాలి. నిపుణులతో సంప్రదిం చాలి. విద్యుత్‌ రంగ ప్రముఖులను పిలిచి చర్చించాలి.

అప్పుడే రానున్న రోజుల్లో ఈ సంక్షోభాన్ని నివారిం చుకోగలం. అలాగే అన్ని రాష్టాల్ల్రో లభ్యత ఉన్న వనరులను పరిశీలించాలి. సౌర విద్యుత్‌కు ఉన్న అవకా శాలను పెద్ద ఎత్తున అధ్యయనం చేయాలి. దీనివల్ల అన్ని శాఖలు, విభాగాలకు అన్ని ప్రాజెక్టులపై అవగాహ న పెరుగుతుంది.

తద్వారా ఆయా ప్రాజెక్టులను సకాలంలో, సమగ్రంగా పూర్తి చేసేందుకు వీలుంటుంది.ఈ దిశగా సత్వర చర్యలకు ఉపక్రమించాలి. అప్పుడే రానున్న రోజుల్లో మనకు విద్యుత్‌ ఉత్పత్తికి విఘాతం రాదు. ఇందుకు సత్వర కార్యాచారణ దిశగా కేంద్రం అడుగులు వేయాలి. సౌర విద్యుత్‌ పర్యావరణహితం కూడా కాగలదు.

ఇప్పుడున్న సౌరవిద్యుత్‌ విధానంలో లోపాలను గుర్తించి పరిశోధనలకు పెద్దపీట వేయాలి. ఐఐటిలు, ఇతర విద్యాసంస్థలు, సౌరవిద్యుత్‌పై ప్రయోగాలను పెంచేలా చేయాలి. అలా చేసి సౌర విద్యుత్‌ పెంపునకు గల అవకాశాలను గుర్తించాలి. అప్పుడే దేశ విద్యుత్‌ అవసరాలు తీరుతాయి. ఇంధన కొరత తీరుతుంది.