Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

రుద్రుడు కథాకథనాల్లో లోపం స్పష్టం

మాస్‌ రివెంజ్‌ కథగా రుద్రుడు
దారి తప్పిన కథాకథనాలు
రాఘవ లారెన్స్‌ కథానాయకుడిగా తమిళ సినిమా ’రుద్రన్‌’ తెలుగులో ’రుద్రుడు’ గా డబ్బింగ్‌ చేసి విడుదల చేశారు. ఇందులో ప్రియ భవానీ శంకర్‌ కథానాయికగా నటించగా, సీనియర్‌ నటులు నాస్సర్‌ , పూర్ణిమ భాగ్యరాజ్‌, శరత్‌ కుమార్‌ లు కూడా వున్నారు.

ఈ సినిమాకి కతిరేసన్‌ దర్శకుడు, నిర్మాత కూడా. రాఘవ లారెన్స్‌ డాన్స్‌ కొరియోగ్రాఫర్‌ గా, దర్శకుడిగా, నటుడిగా, ’కాంచన’ , ’ముని’ లాంటి హారర్‌ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం. ఇప్పుడు ఈ ’రుద్రుడు’గా వచ్చాడు. రుద్రుడు (రాఘవ లారెన్స్‌) ఒక సాధారణ ఉద్యోగి, తల్లి దండ్రులతో (నాసర్‌, పూర్ణిమ భాగ్యరాజ్‌) హ్యాపీ గా ఉంటూ ఉంటాడు.

ALSO READ: నాని సినిమాలు… హిట్‌- ఫ్లాప్‌లు

అతనికి అనన్య (ప్రియా భవాని శంకర్‌) తో పరిచయం, ప్రేమగా మారడం పెళ్లి వరకు దారితీయటం జరుగుతుంది. రుద్ర తండ్రి తన ట్రావెల్‌ కంపెనీ ని విస్తరించడం కోసం రూ.6 కోట్ల రూపాయలు అప్పు తీసుకుంటాడు, కానీ తన స్నేహితుడు మోసం చెయ్యడంతో ఆ డబ్బు పోవటమే కాకుండా దానికి వడ్డీ కట్టలేక గుండెపోటుతో మరణిస్తాడు.

రుద్ర ట్రావెల్‌ కంపెనీ అమ్మేసి కొంత అప్పు తీరుస్తాడు, అలాగే కంపెనీ వాళ్ళు లండన్‌ వెళ్ళమంటే ముందు తల్లిని, భార్యని వదిలి వెళ్ళటానికి ఇష్టపడడు కానీ అప్పు తీర్చాలని వెళతాడు. ఇండియా నుండి భార్య, కూతురు లండన్‌ వచ్చి కొన్నాళ్ళు రుద్రతో వుంటారు.

మళ్ళీ ఇండియా వెళ్ళటానికి భార్య అన్ని ఏర్పాట్లు చేసుకొని బయలుదేరుతుంది, కానీ ఇండియా లో ఇంటికి చేరుకోదు. ఈలోగా రుద్ర తల్లి మరణిస్తుంది. రుద్ర, కూతురితో ఇండియా వచ్చేస్తాడు. రుద్ర తల్లిది సహజ మరణెళిమేనా, భార్య ఎక్కడికి వెళ్ళింది, ఎలా మాయం అయింది, దీని వెనక వున్న మిస్టరీ ఏంటి అన్నదే రుద్ర’ సినిమా కథ.

మామూలుగా వేరే భాష సినిమాని తెలుగులో విడుదల చేయాల్సి వచ్చినప్పుడు చిన్న చిన్న సాంకేతిక మార్పులు చేస్తారు, అంటే పేరులున్న బోర్డులు లాంటివి తమిళం లో కాకుండా తెలుగులో ఉండేట్టు. కానీ ఈ ’రుద్రుడు’ సినిమా అలాంటిదేవిూ లేకుండా కేవలం డబ్బింగ్‌ మాత్రం చేసి విడుదల చేశారు. అందువల్ల ఇది తెలుగు సినిమాల కనిపించదు. దానికి తోడు సినిమాలో చెప్పాలనుకున్న కథ కూడా అంత తొందరగా రాదు.

సినిమా మొదలవ్వటమే ఒక పెద్ద పోరాట సన్నివేశంతో మొదలవుతుంది. నేపధ్య సంగీతం అయితే చెవులు బద్దలు అయిపోతాయా అన్నంతగా వుంది. పాటలు అర్థం కావు, ఆ డాన్సులు కూడా. అందరికీ తెలిసిపోతూ ఉంటుంది, ఇప్పుడు ఒక పాట వస్తుంది, అలాగే ఇప్పుడు ఒక పోరాట సన్నివేశం వస్తుంది. అందరూ ఓవర్‌ యాక్షన్‌ చేస్తూ వుంటారు.

తమిళ ప్రేక్షకులకి చావు చూపించటం బాగా ఇష్టం ఏమో, బాబోయ్‌ రుద్ర తల్లి చనిపోయినప్పుడు చూడాలి, ఆ సన్నివేశాలూ వాళ్ళ ఓవర్‌ యాక్షన్‌. ఇంతకీ సినిమా కథ ఏంటి అనేది చివర్లో వస్తుంది. అంతవరకు సస్పెన్స్‌. లాజిక్‌ ఉండదు.

ఒక్కోసారి అయితే ఆ కొట్టుకోవటాలు అంత అవసరమా అనిపిస్తూ ఉంటుంది కూడా. ఎందుకంటే అలాంటివి చూసి చూసి విసుగుపుట్టేస్తోంది. చివరికి ఇది కూడా ఒక రివెంజ్‌ యాక్షన్‌ సినిమా అని చెప్పారు. ప్రేక్షకులకు ఇలా కొట్టుడు, నరకుడు వున్న సినిమాలో నచ్చుతాయో ఏంటో మరి. అలాగే ఆ తండ్రీ కొడుకుల అనుబంధం కూడా మరీ ఓవర్‌ చేసి చూపించారు. మొత్తంగా కథాకథనాల్లో లోపం స్పష్టంగా కనిపించింది.