Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

కొత్తగా 11వేలు దాటిన కరోనా కేసుల సంఖ్య

దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు
మరో 29 మరణాలు నమోదు
న్యూఢిల్లీ,ఏప్రిల్‌14:దేశంలో కరోనా కేసుల సంఖ్య 24గంటల్లోనే 11వేల 109కు చేరుకున్నాయి.
29మరణాలు నమోదయ్యాయి.

ఇవి గడిచిన ఏడు నెలల్లోనే అత్యధికమని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడిరచింది. దీంతో కరోనా యాక్టివ్‌ కేసుల సంఖ్య 49వేల622కు చేరుకుంది.

రోజూ వారి పాజిటివిటీ రేటు 5.01శాతం ఉండగా, వారం వారీ పాజిటివిటీ రేటు 4.29శాతంగా నమోదైంది. ఇప్పటి వరకు దేశంలో కరోనాతో కోలుకున్న వారి సంఖ్య 44,42,16,583కు చేరుకున్నాయి.

ALSO READ: రూ.10 లక్షలకు డివిజన్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ పేపర్‌ కొనుగోలు…

తాజాగా నమోదైన మరణాలతో కలిపి ఇప్పటివరకు కొవిడ్‌ బారిన పడి చనిపోయిన వారి సంఖ్య 5,31,064కు చేరుకుంది. గత 24గంటల్లో 476 కరోనా వ్యాక్సిన్లు అందించినట్టుగా కేంద్రం వెల్లడిరచింది.

ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా చేపట్టిన వాక్సినేషన్‌ డ్రైవ్‌ లో భాగంగా 220,66,25,120 కోట్ల వ్యాక్సిన్లు అందజేసినట్టు స్పష్టం చేసింది. ముంబైలో ఏప్రిల్‌ 13న ఒక్కరోజే 274కరోనా కేసులు నమోదవడం కలకలం సృష్టిస్తోంది.

దీంతో ఇప్పటివరకు ముంబైలో కరనా కేసుల సంఖ్య 11,59,819 కు చేరుకుంది, మరణాల సంఖ్య 19,752 వద్ద స్థిరంగా ఉన్నట్టు తెలుస్తోంది.

ఏప్రిల్‌ 12న 320 కరోనా కేసులు నమోదు కాగా.. ఇది గత ఏడాది సెప్టెంబర్‌ తర్వాత 300 కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. ఢిల్లీలో ఏప్రిల్‌ 13న ఒక్కరోజే 27.77 శాతం పాజిటివిటీ రేటుతో 1,527 కొవిడ్‌ `19 కేసులు నమోదయ్యాయి.