కొత్తగూడెంలో…. సైబీరియన్ కొంగల సందడి
కొత్తగూడెం గ్రామానికి ఎమ్మెల్యే, ప్రత్యేక నిధులు కేటాయించి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని గ్రామస్తుల వేడుకోలు.
తుంగతుర్తి ఏప్రిల్ 14 నిజం న్యూస్
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కొత్తగూడెం గ్రామపంచాయతీకి ఆది నుండి పోరాటాల గడ్డగా పేరుగాంచిన గ్రామం. దీంతోపాటు గడిచిన 15 సంవత్సరాలుగా సైబీరియన్ దేశము నుండి సైబీరియన్ కొంగలు వలసగా వచ్చి, గ్రామంలోని చింత ,వేప చెట్లపై నివాసం ఏర్పాటు చేసుకొని, పర్యాటకుల పట్ల సైబీరియన్ జాతి పక్షులు, ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి.
తుంగతుర్తి నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న గల కొత్తగూడెం గ్రామంలో సైబీరియన్ జాతి కొంగలు, జనవరి మాసం లోకి వచ్చి ఆడ కొంగలు గుడ్లు పెట్టి, పిల్లలను పొదిగి, గ్రామం ఊరు బయటగల చెరువులో చేపల వేట చేసి ఆహారాన్ని సంపాదించి మగ కొండలు గూటికి చేరి పిల్లలకు ఆహారంగా అందిస్తాయి.
ALSO READ: పది భాషల్లో త్రీడీలో సూర్య చిత్రం
ఈ కొంగలు సుమారు 6 నెలలు ఈ ప్రాంతంలో పెరిగి తిరిగి జూన్ మాసంలో సైబీరియా దేశానికి వెళ్లిపోతాయి. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే కొన్ని పిల్లలు పుట్టి పెద్దగా అయినంత తరవాత రెండు మూడు కొంగలు ఇక్కడ ఉండి మిగిలి ఉన్న కొంగలను తీసుకొని వెళ్లడం విశేషం.
ఈ ఆరు నెలలు గ్రామంలో ఎవరు వాటి జోలికి వెళ్లరు. అప్పుడప్పుడు కొంగలకు గాయాలు ఏర్పడినప్పుడు సంబంధిత వైద్యాధికారి తో మాట్లాడి చికిత్స చేసి చెట్టు పైకి వదులుతారు. ప్రతి సంవత్సరం రాష్ట్రం నలుమూలల నుండి మా ప్రాంతాన్ని చూడడానికి పర్యాటకులు వస్తూ ఉంటారు. ఇది చాలా సంతోషకరమైన విషయం.
ప్రక్కనే చెరువు ఉన్నందున చెరువును ట్యాంకుబండిగా మారిస్తే బాగుంటుంది. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ సహకారంతో కొత్తగూడెం ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుటకు ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని గ్రామస్తులు పర్యాటకులు, మేధావులు, కోరుతున్నారు.
కొత్తగూడెం గ్రామాన్ని పర్యాటక ప్రాంతంగా మార్చాలి.
సింహాద్రి యాదవ్ ….కొత్తగూడెం.
గడిచిన 15 సంవత్సరాలుగా సైబీరియన్ దేశము నుండి సైబీరియన్ జాతి కొందరు మా గ్రామానికి రావడం చాలా సంతోషకరమైన విషయం జనవరి నెలలో వచ్చి జూన్ వరకు ఉండి ఆడ కొంగలు గుడ్లు పెట్టి పొదిగి తిరిగి జూన్ మాసంలో వెళ్లిపోతాయి మగ కొంగలు పిల్లలకు ఆహారాన్ని తీసుకువస్తాయి. శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ ప్రత్యేక శ్రద్ధతో ప్రత్యేక నిధులు కేటాయించినట్లయితే పర్యాటక ప్రాంతంగా మారుటకు కృషి చేయాలని కోరారు….