Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

పది భాషల్లో త్రీడీలో సూర్య చిత్రం

16న సూర్య చిత్రం టైటిల్‌ ప్రకటన
కొత్త తరహా కథలు, ప్రయోగాత్మక చిత్రాలకు ప్రాధాన్యతను ఇచ్చే సూర్య.. ప్రస్తుతం ఓ భారీ పాన్‌ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు. ’శౌర్యం’ శివ డైరెక్ట్‌ చేస్తున్న ఈ సినిమాను ఏకంగా పది భాషల్లో త్రీడీలో రూపొందిస్తున్నారు.

సూర్య కెరీర్‌లో ఇది 42వ చిత్రం. స్టూడియో గ్రీన్‌, యూవీ క్రియేషన్స్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి. మూవీ టైటిల్‌ అనౌన్స్‌మెంట్‌కు సంబంధించి అప్‌డేట్‌ ఇచ్చారు మేకర్స్‌.

ALSO READ: మహేశ్‌ బాబుతో రాజమౌళి జంగిల్‌ అడ్వెంచర్‌ సినిమా

ఈ నెల 16న ఉదయం 9.05 నిముషాలకు టైటిల్‌ను రివీల్‌ చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌ ఆకట్టుకుంది. ఆయుధాలతో గుర్రంపై స్వారీ చేస్తున్న ఓ యోధుడు ఒక కొండ చివరి నుండి మరో కొండ పైకి జంప్‌ చేస్తున్నట్టుగా ఈ పోస్టర్‌ను డిజైన్‌ చేశారు.

దిశాపటాని హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని అందిస్తున్నాడు.

ఇదిలా ఉంటే తెలుగులో స్టెయ్రిట్‌ సినిమా చేసే ఎలాన్‌లో ఉన్న సూర్య.. చందు మొండేటి దర్శకత్వంలో ఓ సినిమా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల చెన్నై వెళ్లి ఓ స్టోరీ కూడా వినిపించాడట చందు. త్వరలోనే ఈ కొత్త ప్రాజెక్ట్‌పై క్లారిటీ రానుంది.