పోడు భూముల సమస్యను పరిష్కరించాలి
ప్రజాపోరు యాత్రను జయప్రదం చేయండి ..రావులపల్లి రాంప్రసాద్
చర్ల ఏప్రిల్ 13 (నిజం న్యూస్) మండల కేంద్రంలో
సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ప్రజాపోరు యాత్రను జయప్రదం చేయాలని సిపిఐ రాష్ట్ర కార్య వర్గ సభ్యులు రావులపల్లి రాంప్రసాద్ గురువారం పిలుపునిచ్చారు.
చర్ల సిపిఐ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. హామీల అమలుకై జిల్లా సమగ్ర అభివృద్ధి రక్షణగా సిపిఐ ప్రజాపోరు యాత్ర చేపట్టిందని తెలిపారు.
ఏప్రిల్ 14 నుంచి మే 14 వరకు బిజెపి హటావో దేశ్కో బచావో పేరుతో దేశవ్యాప్తంగా జరుగుతున్న సమరశీల పోరాటానికి మద్దతు ఇవ్వాలని అన్నారు. ప్రజాపోరు యాత్ర ఏప్రిల్ 14.చర్ల నుంచి ప్రారంభమవుతుందని తెలిపారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోడు భూముల సమస్యను పరిష్కరించాలని సాగులో ఉన్న గిరిజన, గిరిజన ఇతరుల పేదలందరికీ హక్కు పత్రాలు ఇవ్వాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం నూతన భూగర్భ బొగ్గు బావులను చర్ల, గుండాల అని శెట్టిపల్లి రాంపూర్ ప్రాంతాల్లో ప్రారంభించి జిల్లా యువతకు ఉపాధి కల్పించాలని అన్నారు
ALSO READ: మతం పేరుతో ప్రజల మధ్య ఘర్షణను సృష్టించి…
భద్రాచలం పుణ్యక్షేత్రానికి రైలు మార్గం ఏర్పాటు చేసి రైల్వే స్టేషన్ నిర్మించాలని పారిశ్రామిక ప్రాంతమైన కొత్తగూడెంలో ఇ.ఎం.సి. హాసుపత్రిఏర్పాటు చేయాలని కొత్తగూడెం కేంద్రంగా ఐటి యాబ్ ఏర్పాటు చేసి సాఫ్ట్వేర్ రంగంలో యువతకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు
వివిధ సమస్యలపై ఎలుగెత్తి పోరాడే విధంగా ఇంటింటికి సిపిఐ పేరుతో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని జరుగుతున్న పోరాటానికి సమస్త ప్రజానీకం కలిసి రావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో సిపిఐ మండల కార్యదర్శి నూక పోతయ్య. సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కల్లూరివెంకటేశ్వరావు. జిల్లా సమితి సభ్యులు అడ్డగర్ల తాతాజీ . సిపిఐ నాయకులు. కార్యకర్తలు పాల్గొన్నారు