పబ్‌జీ బ్యాన్‌.. బీటెక్‌ స్టూడెంట్‌ ఆత్మహత్య

అనంతపురం: బాటిల్‌ గ్రౌండ్‌ గేమ్‌ పబ్‌జీకి బానిసైన ఓ బీటెక్‌ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం పబ్‌జీ సహా 118 చైనా యాప్‌లపై నిషేధం విధించింది. దాంతో ఎడతెరిపిలేకుండా గేమ్‌లోనే మునిపోయే కిరణ్‌కుమార్‌రెడ్డి (23) తీవ్ర కుంగుబాటుకు గురయ్యాడు. అనంతపురం రెవెన్యూ కాలనీలోని తన నివాసంలో ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. శనివారం ఉదయం ఈ ఘటన వెలుగుచూసింది.