టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో…40లక్షలు

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో ఇడి
వివరాలు ఇవ్వాలని సిట్‌కు లేఖ
హైదరాబాద్,ఏప్రిల్13: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సిట్ వర్సెస్ ఈడీగా మారింది. ఈ కేసులో రంగంలోకి దిగిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్..సిట్‌ను వివరాలు ఇవ్వాల్సిందిగా మార్చి 23వ తేదీన లేఖ రాసింది. పేపర్ లీక్ కేసుకు సంబంధించిన మొత్తం 8 డాక్యుమెంట్ల ఇవ్వాలని లేఖలో కోరింది. అయితే ఈడీ లేఖకు సిట్ అధికారులు స్పందించకపోవడంతో నాంపల్లి కోర్టును ఆశ్రయించింది.
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో సిట్ తమకు ఎలాంటి సమాచారం ఇవ్వట్లేదంటూ పిటిషన్ దాఖలు చేసింది ఈడీ. ఈ కేసులో మనీ లాండరింగ్ కోణం లో దర్యాప్తు చేయాలని భావించిన ఈడీ..కేసు వివరాలు ఇచ్చేలా సిట్ కు
ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ లో కోరింది. అటు ఈడి పిటిషన్ పై సిట్ కూడా కౌంటర్ దాఖలు చేసింది. కేసు కీలక దశలో ఉన్నందున వివరాలు ఇవ్వడం కుదరదని వివరిచింది. దీనిపై విచారణ జరగనుంది.
ALSO READ: కొంత మంది CM లు సచివాలయానికి కూడా రారు
మరోవైపు టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఇంచార్జ్ శంకరలక్ష్మీ ఈడీ ఎదుట హాజరయ్యారు. సెక్షన్ 50 ప్రకారం శంకర్ లక్ష్మీ వాగ్మూలాన్ని ఈడీ అధికారులు రికార్డ్ చేశారు. శంకరలక్ష్మీ కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఇంచార్జ్‌గా ఉన్న నేపథ్యంలో.. ప్రవీణ్, రాజశేఖర్‌లకు పేపర్లు ఎలా చేరాయనే వివరాలను ఈడీ ఆరా తీసింది.
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్‌కు సంబంధించి సిట్ నమోదు చేసిన కేసులో శంకరలక్ష్మీని పేర్కొంది. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో రంగంలోకి దిగిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్.. కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఇంచార్జ్ శంకరలక్ష్మీతో పాటు అడ్మిన్ అసిస్టెంట్ సెక్రటరీ సత్యనారాయణలకు నోటీసులు జారీ చేసింది.
ఏప్రిల్ 13న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఇందులో భాగంగా శంకరలక్ష్మీ ఈడీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. టీఎస్పీఎస్సీ కేసులో ఆర్థిక లావాదేవీలపై ఈడీ దృష్టి పెట్టింది.
పబ్లిక్ డొమైన్ ద్వారా ఇప్పటికే వివరాలు సేకరించిన ఈడీ.. ఇఅఎఖీ నమోదు చేసింది. భారీ మొత్తంలో డబ్బులు చేతులు మారాయని ఈడీ గుర్తించింది.
ఈ కేసులో ప్రధాన నిందితులు రాజశేఖర్, ప్రవీణ్ కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై నిందితుల తరపు న్యాయవాది స్పందనను తెలియజేయాల్సిందిగా అతనికి నోటీసులు జారీ చేసింది.
టీఎస్‌పీఎస్‌సీ నిందితుల వద్ద నుంచి సిట్ 7లక్షలు సేకరించింది. 40లక్షలు డబ్బులు చేతులు మారాయని గుర్తించింది.