Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

డయ్యర్‌ను చంపిన నిజమైన దేభభక్తుడు… ఉద్దం సింగ్‌

జలియన్‌వాలా బాగ్‌ ఉదంతం ఓ రక్త చరిత్ర

చండీఘడ్‌,ఏప్రిల్‌13(ఆర్‌ఎన్‌ఎ): నిజమైన దేశభక్తి అంటే ఏంటో నిరూపించిన మహా వీరుడు.. ఉద్దం సింగ్‌. జలియన్‌ వాలాబాగ్‌ దురంతం భారత స్వాతంత్య సంగ్రామ సమయంలో జరిగిన దురదృష్టమైన సంఘటన.

జలియన్‌ వాలాబాగ్‌ అనేది ఉత్తర భారతదేశంలోని అమృత్సర్‌ పట్టణంలో ఒక తోట. ఏప్రిల్‌ 13, 1919 న ఆనాటి బ్రిటీష్‌ సైనికులు జనరల్‌ డయ్యర్‌ సారథ్యంలో ఈ తోటలో సమావేశమైన నిరాయుధులైన స్త్రీ, పురుషులు, పిల్లలపైన విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.

ఈ కాల్పులు పది నిమిషాలపాటు కొనసాగాయి. 1650 రౌండ్లు కాల్పులు జరిగాయి. అప్పటి ఆంగ్ల ప్రభుత్వ లెక్కల ప్రకారం 379 మంది మరణించారు. కానీ ఇతర గణాంకాల ప్రకారం అక్కడ 1000 కి పైగా మరణించారు. 2000 మందికి పైగా గాయపడ్డారు.

1920 లో గాంధీజీ ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా సహాయ నిరాకరణోద్యమం ప్రారంభించడానికి నాంది పలికింది. భగత్‌ సింగ్‌ విప్లవకారుడిగా మారడానికి కూడా ఈ సంఘటనే కారణం. విశ్వకవి రవీంద్రనాథ్‌ టాగూర్‌, బ్రిటీష్‌ ప్రభుత్వం తనకిచ్చిన సర్‌ బిరుదిని ఇంగ్లాండ్‌ ప్రభువుకు తిరిగి ఇచ్చివేశాడు. మొత్తవ్మిూద సంఘటన వేగవంతం చేసిందని చెప్పవచ్చు.

జలియన్‌ వాలా బాగ్‌ ఊచకోతలో వేల మంది అమాయకులను కాల్చి చంపిన జనరల్‌ డయ్యర్‌ ను 21 ఏళ్ళ తర్వాత వాళ్ళ దేశం వెళ్ళి మరీ కాల్చి చంపిన ఉద్ధం సింగ్‌ నిజమైన దేశభక్తుడు. 1919, ఏప్రిల్‌ 13న జలియన్‌ వాలాబాగ్‌ సమావేశమైన ప్రజలకు మంచి నీళ్ళు ఇవ్వటానికి వాలెంటీర్‌గా వచ్చాడు. తన కళ్ళ ముందే నిరాయుధులైన సాటి భారతీయులను చంపటం చూసి ఆ బాధలో ’ఇంత మంది భారతీయులను చంపిన డయ్యర్ను చంపకపోతే.. నేను భారతీయుడినే కాదు’ అని శపధం చేసుకున్నాడు.

ALSO READ: విశాఖ స్టీల్‌….కెసిఆర్‌ ఉక్కు పిడికిలి ! 

ఈ లోగా బ్రిటీష్‌ ప్రభుత్వం డయ్యర్ని బ్రిటన్‌ పంపేసింది. అతన్ని చంపటం కోసం ఉద్ధం సింగ్‌ కూలిపనుల నెపంతో జర్మనీ వెళ్లాడు. అక్కడి నుండి రహస్యంగా లండన్‌ వెళ్ళాడు . అక్కడ ఉంటూనే.. ఒక ప్రణాళికను రచించాడు. దాని ప్రకారం డయ్యర్‌ మార్చ్‌ 13న ఈస్ట్‌ ఇండియా కంపెనీ తరపున విూటింగ్‌కు వెళ్తున్నాడని తెలుసుకుని.. అక్కడికి ముందుగానే చేరుకున్నాడు.

డయ్యర్‌ తనకు కనిపించగానే.. గన్‌ తో కాల్చి చంపేసాడు . ’నా భారతీయుల ప్రాణాలకు నీకు ఇదే శిక్షరా..’ అన్నాడు.1940, జులై 31న ఉద్ధం సింగ్‌ ని ఉరితీసి చంపారు. ఆ శిక్ష విధించబోయే ముందు కోర్టులో ’నేనే చేశాను ఈ హత్య. అతని విూద నాకు పగ. నేను అతనిని చంపేటంత తప్పు చేసాడు, నా దేశ ప్రజలను చంపాడు. అందుకనే వాడిని చంపేసాను. అందుకోసం 21 సంవత్సరాలు వేచి చూసాను.

నేను ఈ పని చేసినందుకు సంతోషంగా ఉన్నాను. నేను మరణశిక్షకు భయపడటం లేదు. నేను నా దేశం కోసం మరణిస్తున్నాను. అది నా బాధ్యత. నా మాతృభూమి కోసం మరణం కన్నా.. నాకు ఎక్కువ గౌరవం ఇవ్వబడుతుందని ఉద్దం సింగ్‌ అన్నాడు.

ఉద్ధం సింగ్‌ డయ్యర్ని వెతకటంలో భాగంగా కొన్ని రోజులు తిండి లేక కేవలం మంచి నీళ్ళు తాగి బతికాడు. అతని పట్టుదల, త్యాగనిరతి, సాహసం ఎంత గొప్పవో అర్ధం చేసుకోవటానికి డయ్యర్‌ హత్యే ఉదాహరణ.