చెన్నై, కోల్‌కతాలో పాక్ మ్యాచ్‌లు
-వరల్డ్ కప్‌పై ఐసిసి ఆశాభావం
న్యూఢల్లీి,ఏప్రిల్12(ఆర్‌ఎన్‌ఎ): ఇండియా ఆతిథ్యం ఇచ్చే వన్డే వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ టీమ్ తమ మ్యాచ్‌లను చెన్నై, కోల్‌కతాలో ఆడే అవకాశం ఉంది. ఇది వరకు అక్కడ ఆడిన నేపథ్యంలో ఈ రెండు వేదికలను పాక్ సురక్షితంగా భావిస్తోందని ఐసీసీ వర్గాలు తెలిపాయి.
వన్డే వరల్డ్ కప్ అక్టోబర్ 5న మొదలయ్యే అవకాశం ఉండగా.. మొత్తం 46 మ్యాచ్‌లు 12 సిటీల్లో జరగనున్నాయి. వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ ఆడే వేదికల విషయంలో ఐసీసీ ఎగ్జిక్యూటివ్ స్థాయి వ్యక్తి పీసీబీతో చర్చలు జరుపుతున్నారు.
’బీసీసీఐ, ఇండియా గవర్నమెంట్‌ను సంప్రదించిన తర్వాతే వేదికలు ఖరారు అవుతాయి. చాయిస్ ఇస్తే మాత్రం పాక్.. కోల్‌కతా, చెన్నైలోనే ఆడుతుంది. 2016 టీ20 వరల్డ్‌కప్‌లో ఇండియాతో పాక్ పోటీ పడిరది. భద్రత పట్ల ప్లేయర్లు సంతృప్తి వ్యక్తం చేశారు.
ALSO READ: వార్నర్ సేనకు హ్యాట్రిక్ ఓటమి
అలాగే, చెన్నైలో కూడా పాక్‌కు మంచి జ్ఞాపకాలు ఉన్నాయి’ అని ఐసీసీ బోర్డు వర్గాలు చెప్పాయి. మెగా టోర్నీలో ఇండియా, పాక్ మ్యాచ్ కోసం యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తోంది.
1.32 లక్షల సీటింగ్ కెపాసిటీ ఉన్న అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ మ్యాచ్‌ను నిర్వహిస్తే ఐసీసీకి మంచి లాభాలు రానున్నాయి. కానీ, ఆ స్టేడియంలో జరగనుంది. కాబట్టి మరో వేదికను చూడాల్సి ఉంది.
ఆతిథ్య బీసీసీఐతో సమావేశమై ఐసీసీ ఒకటి రెండు నెలల్లో వరల్డ్‌కప్ ప్రాథమిక షెడ్యూల్‌ను విడుదల చేసే చాన్సుంది.