Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

సస్పెన్స్‌ థ్రిల్లర్‌ గా అసలు

అసలు..విషయం చెప్పిన రవిబాబు
పరిపూర్ణ నటి…మన పూర్ణ
అల్లరి రవి బాబు చాలా రోజుల గ్యాప్‌ తరువాత ’అసలు’అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇది ఈటీవీ విన్‌ అనే ఓ.టి.టిలో ఏప్రిల్‌ 13న గురువారం విడుదల అవుతోంది. ఈ సినిమాలో అల్లరి రవిబాబు తో పాటు పూర్ణ కూడా ఒక ముఖ్య పాత్రలో కనిపిస్తుంది.

ఈ సినిమాకి రవిబాబు రచన, నిర్మాత గా వ్యవహరించారు. ఈ సినిమాని ఉదయ్‌ అండ్‌ సురేష్‌ఇద్దరు దర్శకత్వం వహించారు. ఇదొక సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సినిమా.’ఇందులో నేను టాస్క్‌ ఫోర్స్‌ హెడ్‌ గా చేస్తున్న. మర్డర్‌ జరిగినప్పుడు నేను సైకాలాజికల్‌ గా కూడా ఆలోచిస్తుంటా. మామూలుగా మర్డర్‌ మిస్టరీ లో ఒక హత్య జరిగితే హంతకుణ్ణి పట్టుకుంటారు, కానీ ఈ సినిమాలో మర్డర్‌ ఎవరు చేశారు అనే ఒక్క పాయింట్‌ కాకుండా, ఎందుకు చేసారు, ఎలా చేశారు అనే చాలా కోణాలు కూడా వున్నాయి.

ఇదొక ఆసక్తికరంగా వుండే సస్పెన్స్‌ త్రిల్లర్‌,’ అని చెప్పాడు రవిబాబు. ఇందులో పూర్ణ ప్రొఫెసర్‌ పాత్రలో కనపడుతుంది. ఆమె రవిబాబు కి మర్డర్‌ మిస్టరీ చేధించటంలో సహాయం చేస్తూ ఉంటుంది. ఆమెకి ఫోరెన్సిక్‌ లో అనుభవం ఉంటుంది, అందువల్ల ఆమె సహాయం చేస్తుంది.

అయితే పూర్ణ ఎక్కువ రవిబాబు సినిమాల్లో కనపడుతూ ఉంటుంది. అందువలన ఎందుకు ఆమె ఇతని సినిమాల్లోనే ఎక్కువ యాక్ట్‌ చేస్తుంది అనే ఆసక్తికర ప్రశ్న కూడా వస్తూ ఉంటుంది. అదే విషయం రవి బాబుని అడిగితే, అతను నవ్వేసి మంచి నటి ఆమె అని చెప్పాడు.

ALSO READ: సినిమా సెట్‌లో పేలుడు…..సంజయ్‌ దత్‌కు గాయాలు

’పూర్ణ టెర్రిఫిక్‌ యాక్టెస్ర్‌. మనం కథ చెప్పినప్పుడు ఆమె కథ వింటునప్పుడే ఆ పాత్రలో లీనం అయిపోతుంది. ఆమె మంచి పెర్ఫార్మర్‌, ఎటువంటి రోల్‌ ని అయినా ఆకళింపు చేసుకొని స్క్రీన్‌ విూద నటించి చూపెడుతుంది. ఆమెలా నటించే వాళ్ళు ఇప్పుడు చాలా తక్కువ వున్నారు.

ఇవన్నీ కాకుండా ఎటువంటి భేషజాలకు పోదు, దర్శకుడు ఏమి చెప్తే అది చేసి చూపిస్తుంది. అందువల్లనే ఆమె నా సినిమాల్లో ఎక్కువ కనపడుతుంది, అంతే కానీ మరెటువంటి దేవిూ లేదు,’ అని చెప్పాడు రవిబాబు.

ఈ సినిమా తరువాత సోనీ ఛానల్‌ వాళ్ళకి కూడా ఒక సినిమా చేస్తున్నాను అని చెప్పాడు రవిబాబు. ఆ కథ వాషింగ్‌ మెషిన్‌ చుట్టూ తిరుగుతుంది. అందుకని దానికి ’వాషింగ్‌ మెషిన్‌’ అని టైటిల్‌ పెట్టాడు.

దాంట్లో వి.కె. నరేష్‌, కమెడియన్‌ సత్య , వాషింగ్‌ మెషిన్‌ కూడా ఒక పాత్ర పోషిస్తుంది అని చెప్పాడు రవిబాబు. ఈ సినిమా థియేటర్స్‌ లో కూడా విడుదల అవుతుంది అని చెప్పాడు రవిబాబు.