Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఇదంతా డి-9 గ్యాంగ్‌ పనే

నిబంధనలకు విరుద్దంగా భవన అనుమతులు
బంజారాహిల్స్‌, జూబ్లీ హిల్స్‌లో బహుళ అంతస్థులు
డి`9 గ్యాంగ్‌ పనేననంటూ రేవంత్‌ ఆరోపణలు
హైదరాబాద్‌,ఏప్రిల్‌12(ఆర్‌ఎన్‌ఎ): నిబంధనలకు విరుద్దంగా గతంలో ఎప్పుడూ లేనంత అక్రమంగా..
బంజారాహీల్స్‌, జూబ్లీహీల్స్‌ ప్రాంతాల్లో నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారని, దీంతో బహుళ అంతస్థుల భవనాలు లేచాయని పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి ఆరోపించారు.

ప్రత్యేక నిబంధనలు ఉన్నా వాటిని కాదని నిర్ణయాలు తీసుకున్నారని అన్నారు. కేబీఆర్‌ పార్క్‌ దగ్గర నిర్మాణాలకు కూడా ప్రత్యేక నిబంధనలు ఉన్నాయని చెప్పారు. అందుకే పార్క్‌ చుట్టూ కమర్షియల్‌ కాంప్లెక్స్‌లు తక్కువగా ఉన్నాయని వెల్లడిరచారు. కేసీఆర్‌ వచ్చాకే కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ నిర్మాణాలు పెరిగాయన్నారు.

బీసీ స్టడీ సర్కిల్‌ సెంటర్‌ దగ్గర నిజాం హెరిటేజ్‌ బిల్డింగ్‌ ఉండేదని.. దాన్ని నిబంధనలకు విరుద్ధంగా కూలగొట్టారని ఆరోపించారు. హెరిటేజ్‌ బిల్డింగ్‌ ను కుర్రా శ్రీనివాస రావు అనే వ్యక్తి కొన్నారని వెల్లడిరచారు. శ్రీనివాస రావుకు అనుమతుల కోసం కొంత భూమిని అడిగారని ఆరోపించారు. గ్రీన్‌జోన్‌లో ఉన్న వారసత్వ బిల్డింగ్‌ ను కూలగొట్టి కొత్త నిర్మాణాలకు పర్మిషన్‌ ఇచ్చారని ఆరోపించారు.

ALSO READ: కళ్లుండీ కాళేశ్వరం చూడలేనోళ్లు వాళ్ళు

గ్రీన్‌ జోన్‌ లో కొత్త నిర్మాణానికి ఎలా అనుమతిస్తారని నిలదీశారు. రూల్స్‌ విరుద్ధంగా కొత్త భవనానికి అనుమతిచ్చారని ఆరోపించారు. 5 అంతస్తుల భవనానికి పర్మిషన్‌ ఇవ్వని చోట.. 21 అంతస్తులకు పర్మిషన్‌ ఇచ్చారని తెలిపారు. 3 వేల గజాల స్థలంలో 21 అంతస్థులకు ఎలా పర్మిషన్‌ ఇచ్చారని ప్రశ్నించారు.

పక్కనే ఉన్న బసవతారకం ఆస్పత్రికి 3 అంతస్తుల కంటే ఎక్కువ పర్మిషన్‌ ఇవ్వలేదన్నారు. ఏడుగురు ఐఏఎస్‌ లు, ఇద్దరు తండ్రీ కొడుకులు కలిసి డీ 9 గ్యాంగ్‌ గా మారారని విమర్శించారు. 20 శాతం భూములు రాసిచ్చిన వారికే నిర్మాణాలకు అనుమతిచ్చారని రేవంత్‌ రెడ్డి ఆరోపించారు.

21 అంతస్థుల అపార్ట్‌ మెంట్‌ వల్ల కేబీఆర్‌ పార్క్‌ దగ్గర భారీగా ట్రాఫిక్‌ సమస్యలు వస్తాయన్నారు. కేసీఆర్‌ దుర్మార్గపు పాలనకు ఇది పరాకాష్ట అని ..విూ చేతిలో రాష్టాన్న్రి పెడితే ఇంత విధ్వంసం సృష్టిస్తారా అని మండిపడ్డారు రేవంత్‌.

సింగపూర్‌ మలేషియాల మాదిరిగా ఇక్కడ భవనాలు కట్టడం కాదని..విూరు అక్కడికే వెళితే ఇక్కడి ప్రజలు సుఖశాంతులతో ఉంటారని ఎద్దేవా చేశారు.