ఎమ్మెల్సీ కవితతో తాను చేసిన వాట్సప్ చాట్ ఇదే…

బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితపై ఛాటింగ్ బాంబ్
వాట్సప్ చాట్ ఇదేనంటూ పలు స్క్రీన్ షాట్స్ విడుదల
ఢిల్లీ, ఏప్రిల్12: మనీలాండరింగ్, చీటింగ్ కేసులో ఢిల్లీ జైలులో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్..
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితపై బాంబ్ పేల్చారు. ఢిల్లీ మండోలి జైల్లో ఉన్న సుఖేష్ ఈసారి చాటింగ్ బాంబ్ పేల్చాడు.
ఎమ్మెల్సీ కవితతో తాను చేసిన వాట్సప్ చాట్ ఇదేనంటూ పలు స్క్రీన్ షాట్స్ విడుదల చేశాడు తెలుగు రాని సుఖేశ్ అక్కడక్కడా తెలుగు పదాలతో చాట్ చేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవు తున్నాయి. అక్కా అంటూ పలుమార్లు చాట్‌లో సంభోధించాడు.
డబ్బు డెలివరీ చేశానంటూ వాట్సప్ చాట్‌లో పేర్కొన్నాడు సుఖేశ్. స్పోకెన్ టూ మనీష్ అని రిప్లై కూడా ఇచ్చాడు. గతంలో ఢిల్లీ సీఎం కేజీవ్రాల్‌కు రాసిన లేఖలో సంచలన విషయాలు వెల్లడిరచాడు.
కేజీవ్రాల్, ఢిల్లీ మాజీ మంత్రి సత్యేంద్రజైన్ ఆదేశాలపై హైదరాబాద్ బీఆర్‌ఎస్ ఆఫీస్‌లో రూ.15 కోట్ల డబ్బులు ఎమ్మెల్సీ కారులో ముట్టజెప్పినట్టు ఆరోపించాడు. అరుణ్ రామచంద్ర పిల్ళై ద్వారా డబ్బులు అందచేసినట్టు లేఖలో పేర్కొన్నారు.
మనీలాండరింగ్ కేసులో మండోలి జైలులో ఉన్నాడు సుఖేశ్ చంద్రశేఖర్.
ALSO READ: అక్కా,చెల్లెమ్మలు బాగుంటే… కుటుంబం బాగుంటది
రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన సుఖేశ్ ఆప్ నేతలపై సంచలన ఆరోపణలు చేశాడు. సీఎం కేజీవ్రాల్‌కు వందల కోట్ల ముట్టజెప్పినట్టు ఆరోపించాడు. ఏప్రిల్ 12వ తేదీ ఈ మేరకు వాట్సాప్ చాటింగ్ వివరాలు అంటూ 20 పేజీల లేఖను.. తన లాయర్ ద్వారా విడుదల చేశారు సుఖేష్.
ఢిల్లీ సీఎం కేజీవ్రాల్, సత్యేంద్రజైన్ ఆదేశాల మేరకు హైదరాబాద్ లోని బీఆర్‌ఎస్ పార్టీ ఆఫీసులో 15 కోట్ల రూపాయలు ఇచ్చినట్లు తన లేఖలో స్పష్టం చేశాడు. ఎమ్మెల్సీ కవిత పేరును.. తన ఫోన్ నెంబర్ లో కవిత అక్క టీఆర్‌ఎస్ పేరుతో సేవ్ చేసుకున్నాడు.
కవితతో చాటింగ్ చేసినట్లు చెబుతున్న ఆరు పేజీల చాట్ వివరాలను వెల్లడిరచాడు. అక్కా.. అక్కా అంటూ పరుమార్లు తెలుగులోనూ చాట్ చేయటం విశేషం. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితతో చాట్ చేసిన వివరాలతో పాటు.. ఎవరి ఆదేశాలతో డబ్బులు.. ఎక్కడ.. ఎప్పుడు అప్పగించింది వివరంగా రాస్తూ.. దీనిపై విచారణ చేయాలంటూ లేఖను చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, కేంద్ర హోం మంత్రికి, ఢల్లీి లెప్ట్ నెంట్ గవర్నర్ కు.. సీబీఐ డైరెక్టర్ కు, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి పంపించారు. వాట్సాప్ చాట్ లో కోడ్ భాష వివరాలను కూడా లేఖలో స్పష్టం చేశారు.
ఏకే అంటే అరవింద్ కేజీవ్రాల్ అని.. ఎస్ జే అంటే సత్యేంద్రజైన్ అని.. మనీష్ అంటే మనీష్ సిసోడియా అని.. అరుణ్ అంటే అరుణ్ పిల్ళై అని.. జేహెచ్ అంటే జూబ్లీహిల్స్ అని.. ఆఫీస్ అంటే పార్టీ హెడ్ క్వార్టర్ ఆఫ్ ద టీఆర్‌ఎస్ అని.. ప్యాకేజీ అంటే 15 కోట్ల రూపాయలు అని వివరించాడు.
బ్రో అంటే సత్యేంద్రజైన్ అని.. 15కేజీ నెయ్యి అంటే 15 కోట్ల రూపాయల డబ్బు అని.. 25 కేజీ నెయ్యి అంటే 25 కోట్ల రూపాయలు అని.. సిస్టర్ అంటే కె.కవిత అని.. ఏకే భాయ్ అంటే అరవింద్ కేజీవ్రాల్ అని కోడ్ భాష వివరాలను సుఖేష్ రివీల్ చేశాడు..సుఖేష్ చాటింగ్ పై బీఆర్‌ఎస్ పార్టీలో చర్చనీయాంశం కాగా.. సుఖేష్ కు తెలుగు వచ్చా అనే డౌట్స్ వ్యక్తం అవుతున్నాయి.
కవిత బ్రో అని సంబోధిస్తే.. కవిత అక్కా అంటూ తెలుగు సుఖేష్ మాట్లాడటం విశేషం.. రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన సుఖేశ్ ప్రస్తుతం ఢిల్లీ జైలులో ఉన్నాడు.
ఆప్ నేతలపై కొన్నాళ్లుగా సంచలన ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ఎమ్మెల్సీ కవితకు డబ్బులు ఇచ్చినట్లు గతంలోనే ప్రకటించాడు. ఇప్పుడు వాట్సాప్ చాట్ రిలీజ్ చేయటంతోపాటు.. దీనిపై విచారణ చేయాలని సీబీఐ, సుప్రీంకోర్టు జడ్జి, గవర్నర్, కేంద్ర హోం మంత్రికి లేఖలు రాయటం సంచలనంగా మారింది.