సినిమా సెట్‌లో పేలుడు…..సంజయ్ దత్‌కు గాయాలు
సినిమా సెట్‌లో పేలుడు
ప్రముఖ నటుడు సంజయ్ దత్‌కు గాయాలు
బెంగళూరు,ఏప్రిల్12(ఆర్‌ఎన్‌ఎ): ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ షూటింగ్ లో గాయపడ్డారు. సినిమా సెట్ లో బాంబు పేలే సన్ని వేశంలో సంజయ్‌కు తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది.
ఈ ప్రమాదం కన్నడ చిత్రం ’కెడి’ సెట్స్‌లో జరిగింది. ఈ ప్రమాదంలో సంజయ్ చేతి, మోచేయి, ముఖంపై గాయాలయ్యాయని తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే ఆయనను ఆసుపత్రికి తలరించారు.
ALSO READ: మన దేశంలో అత్యంత ధనికుడైన ముఖ్యమంత్రిగా జగన్
సెట్ మాస్టర్ రవి వర్మ సమక్షంలో ఈ సీన్ షూటింగ్ జరుగుతోంది. ఆ సమయంలో షూటింగ్‌లో వినియోగించేందుకు ఉంచిన బాంబు ఒక్కసారిగా పేలింది. దాంతో సంజయ్ తీవ్రంగా గాయపడ్డారు.
ప్రస్తుతం సంజయ్ దత్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవలే కేజీఎఫ్ సినిమాలో అధీరా గా నటించి మెప్పించారు సంజయ్.
ఇప్పుడు మరో కన్నడ సినిమాలో చేస్తున్నారు. షూటింగ్ లో సంజయ్ గాయపడ్డారని తెలిసి ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.