జీతం కోసం జీవితం అంతం చేసుకున్నాడు

ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఐమాక్స్ సినిమా థియేటర్ ఆపరేటర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఖైరతాబాద్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఖైరతాబాద్‌కు చెందిన భాస్కర్(52) అనే వ్యక్తి ఐమాక్స్ సినిమా థియేటర్‌లో ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. లాక్‌డౌన్ కారణంగా ఐమాక్స్ థియేటర్ యాజమాన్యం సగం జీతం మాత్రమే ఇచ్చింది.