Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

40 డిగ్రీలు దాటుతున్న ఉష్ణోగ్రతలు

దేశ వ్యాప్తంగా పెరుగుతున్న ఎండలు
జమ్మికుంట, ఏప్రిల్‌ 11 (నిజం న్యూస్‌)
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. పలు చోట్ల ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. ఎండతో పాటు వడగాల్పులు వీస్తున్నాయి. అత్య ధికంగా నిర్మల్‌ జిల్లాలోని దస్తూరాబాద్లో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

ALSO READ: యాక్షన్ థ్రిల్లర్ గా నాగ చైతన్య కస్టడీ

రాష్ట్రంలో రాబోయే 5 రోజులు పొడి వాతావరణం ఏర్పడుతుందని, పలు జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

ఈ జాగ్రత్తలు తీసుకోకుంటే ప్రాణాలకు ప్రమాదం దేశవ్యాప్తంగా ఒక్కసారిగా ఎండలు పెరిగిపోయాయి. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు అవసరమైతే తప్పా బయటికి రావద్దు.

ఎండలో పని చేసే కార్మికులు గొడుగులు. చెట్ల కింద ఉండేలా చూసుకోవాలి. వేడిగాలులు తాకకుండా చెవులకు బట్టను కట్టుకోవాలి. నీళ్లు ఎక్కువ తాగుతుండాలి.